మూవీ రివ్యూ: థగ్ లైఫ్ (Thug Life)
నటీనటులు: కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి, నాజర్, మహేష్ మంజ్రేకర్, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: ఏఆర్ రహమాన్
సినిమాటోగ్రఫీ: రవి కే చంద్రన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
బ్యానర్స్: గీతా ఆర్ట్స్
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్, ఉదయనిధి స్టాలిన్
దర్శకత్వం: మణిరత్నం
విడుదల తేది: 5-6-2025
భారతదేశం గర్వంచే నటుల్లో కమల్ హాసన్ ఒకరు. అలాగే మన దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నంకు ప్రత్యేక స్థానం ఉంది. వీళ్లిద్దరి కలయికలో 38 యేళ్ల క్రితం వచ్చిన ‘నాయకుడు’ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో కల్ట్ క్లాసికల్ గా నిలిచిపోయింది. తాజాగా వీళ్ల కాంబినేషన్ లో ‘థగ్ లైఫ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
‘థగ్ లైఫ్’ కథ విషయానికొస్తే.. రంగరాయ శక్తి రాజు (కమల్ హాసన్) తన ఫ్లాష్ బ్యాక్ తో ఈ సినిమా మొదలవుతోంది. 1994 ఓల్డ్ ఢిల్లీ ప్రాంతంలో రంగరాయ శక్తి రాజు అతని అన్న మాణిక్యం (నాజర్) ఒక గ్యాంగ్ స్టర్ గ్రూపుకు లీడర్స్. మరో గ్రూపుకు సదానందం (మహేష్ మంజ్రేకర్) నాయకుడు. ఢిల్లీలై పట్టు సాధించడానికి వీళ్లిద్దరు ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. ఈ క్రమంలో సదానందం చెల్లెలు కుమారుడు వల్ల మాణిక్యం కూతురు గర్భవతి అవుతోంది. దీంతో ఆమె ఇంట్లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత సదానందం మేనల్లుడిని రంగరాయ శక్తి రాజు చంపేస్తాడు. ఆ తర్వాత అదే కేసులో జైలుకు వెళతారు. వెళుతూ వెళుతూ తన పెంపుడు కొడుకు అమర్ (శింబు)కు అప్పగించి వెళతారు. ఆ తర్వాత అమర్, మాణిక్యం కలిసి రంగరాయ శక్తిరాజును హత్య చేస్తారు. అసలు అమర్, మాణిక్యం కలిసి రంగారాయ శక్తిరాజును ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది. ఇక తమ చేతిలో చనిపోయాడనకున్న రంగరాయ శక్తి రాజు ఆ తర్వాత మళ్లీ ఎలా తిరిగొచ్చాడు. తనను చంపాలనుకున్న వాళ్లపై ప్రతీకారం తీర్చుకున్నాడా .. ? ఈ క్రమంలో ఇంద్రాణి (త్రిష) పాత్ర ఏమిటి ? అసలు అమర్ .. శక్తిరాజుకు దగ్గరకు ఎలా వచ్చాడు. తదితర విషయాలు తెలియాంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
మణిరత్నం మన దేశం గర్వించే టెక్నిషియన్స్ లో ఆయన ఒకరు. ఈయన కూడా ‘థగ్ లైఫ్’ అంటూ ఓ గ్యాంగ్ స్టర్ జీవితం ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూపెట్టాడు. పవర్ ముందు అన్నాతమ్ముడు, తండ్రీ కొడుకు అనే బంధం ఏవైనా దిగదుడుపే అనే విషయాన్ని ఈ సినిమాలో చూపెట్టాడు. ముఖ్యంగా మొఘలాయి చక్రవర్తి ఔరంగజేబు.. సింహాసనం కోసం తన తోడబుట్టిన వాళ్లను చంపి.. కన్న తండ్రిని కారాగారంలో వేసి తాను చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. అలాంటి కాన్సెప్ట్ నే తీసుకొని ‘థగ్ లైఫ్’ సినిమా కథను అల్లుకున్నాడు.అంతేకాదు ఇలాంటి గ్యాంగ్ స్టర్స్ కు ఎంత సొంతవాళ్లైనా ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండదు. అంతేకాదు పక్కవాళ్లు చెప్పే కొన్ని విషయాలను నిజం అనుకోని తమకు కావాల్సిన వాళ్లకు వెన్నుపోటు పొడవడం అనేది క్యారెక్టర్ అమర్ (శింబు) పాత్రలో చూపెట్టాడు. తమ్ముడు పెత్తనాన్ని సహించలేని అన్న మాణిక్యం (నాజర్) పాత్రను తీసుకున్నాడు. వీళ్లందరు కలిసి రంగరాయ శక్తిరాజు ను చంపడానికి కుట్ర పన్నడం.. అతను బతికొచ్చి వీళ్లపై ప్రతీకారం తీర్చుకోవడం అంశాలు రొటీన్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా కమల్ హాసన్ తో పాటు శింబును చూపించి విధానం బాగుంది. అంతేకాదు కమల్ హాసన్ కొన్ని రొమాంటిక్ సీన్స్ సినిమాలో పంటికింద రాయిలా కనిపిస్తాయి. ముఖ్యంగా 1990ల నాటి ఓల్డ్ ఢిల్లీ ప్రాంతాన్ని ఈ సినిమాలో చక్కగా తెరపై చూపించాడు. సినిమా మొత్తంగా ఢిల్లీలోనే తెరకెక్కంచాడు. క్లైమాక్స్ తమిళనాడు తిరుచందూర్, గోవాలో ఎండ్ చేసాడు. ఆర్ట్ వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండేది. ఈ సినిమా చూస్తుంటే.. మణిరత్నం తీసిన ‘నవాబ్’ సినిమా తాలుకూ ఛాయలు కనిపిస్తాయి. ఎంతో ఇంటలెక్చువల్ గా తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి.
నటనటుల విషయానికొస్తే..
కమల్ హాసన్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో చక్కగా ఒదిగిపోయాడు. ఇలాంటి పాత్రలు చేయడం కమల్ హాసన్ కు కొత్త కాదు. ఇందులో త్రిషతో పాటు అభిరామితో లిప్ లాక్ సీన్ అనేది కమల్ హాసన్ పట్టుబట్టి మరి పెట్టించినట్టు ఉంది. యాక్షన్ సీన్స్ లో కమల్ హాసన్ ఇరగదీసాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత రైల్వే స్టేషన్ ఫైట్ సీన్ మాస్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. శింబు .. కమల్ హాసన్ కు ధీటుగా నటించి మెప్పించాడు. కమల్ హాసన్ పెంపుడు కుమారుడి పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ తో పాటు విలనిజం చూపించాడు. త్రిష.. ఇంద్రాణి .. కమల్ హాసన్ ఉంపుడుగత్తె పాత్రలో భావోద్వేగపరమైన బరువులైన పాత్రలో ఒదిగిపోయింది. నాజర్, మహేష్ మంజ్రేకర్, అభిరామి తమపాత్రల్లో ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
ప్లస్ పాయింట్స్
కమల్ , శింబు నటన
ఫస్టాఫ్ కొన్ని సీన్స్
ఏఆర్ రెహాన్ ఆర్ ఆర్
మైనస్ పాయింట్స్
సినిమా నిడివి
లాజిక్ లేని సీన్స్
సెకండాఫ్
పంచ్ లైన్.. కమల్ అభిమానులు మెప్పించే ‘థగ్ లైఫ్’..
రేటింగ్: 2/5
Also Read: Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా
Also Read: NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









