Kannada actress Ranya Rao arrested for gold smuggling: సాధారణంగా ఎయిర్ పోర్టులలో నిత్యం కస్టమ్స్ అధికారులు విదేశాల నుంచి వచ్చే వారి మీద నిఘాను పెడుతుంటారు. వీరిలో కొంత మంది అక్రమంగా బంగారంను మన దేశంలోకి తీసుకొస్తుంటారు. కొంత మంది లోదుస్తుల్లో, కడుపులో, పేస్టులాగా చేసి బంగారం ను స్మగ్లింగ్ చేస్తుంటారు. పోలీసుల కళ్లు కప్పి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ పోలీసులు మాత్రం ఎప్పటి కప్పుడు వీరి ప్లాన్ లను భగ్నం చేస్తుంటారు. తాజాగా.. ఒక కన్నడ నటి కస్టమ్స్ అధికారులకు బంగారం స్మగ్లింగ్ చేస్తు అడ్డంగా దొరికిపోయింది.
కన్నడ నటి రన్యారావును కస్టమ్స్ అధికారులు బెంగళూరు ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా నటిపై అనేక అభియోగాలు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. అయితే.. ఈ నటి గత 15 రోజుల్లోనే నాలుగు సార్లు దుబాయ్ కు వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.ఈ క్రమంలో నటి దగ్గర పోలీసులు సోదాలు చేయగా.. ఏకంగా 15 కేజీల వరకు బంగారం బైటపడింది.
నటి రన్యారావు దగ్గర పోలీసులు వెతుకగా.. దుబాయ్ నుంచి అక్రమంగా 14.8 కిలోల బంగారాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్-డీఆర్ఐ అధికారులు గోల్డ్ ను స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Read more: Laila: అరుదైన వ్యాధితో బాధపడుతున్న లైలా.. షాకింగ్ నిజం రివీల్ చేసిన సీనియర్ నటి..
ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నఆ గోల్డ్ విలువ రూ.12 కోట్లు ఉంటుందని తెలిపారు. రన్యా రావును డీఆర్ఐ అధికారులు ప్రశ్నిస్తుండగా.. తాను డీజీపీ కూతుర్ని అని చెప్పినట్లు సమాచారం. దీంతో అధికారులు ఆమెకు పోలీసులతో ఏ విధంగా సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ భామ.. కన్నడలో కిచ్చ సుదీప్‌తో కలిసి రన్యా రావు.. మాణిక్య అనే సినిమాలో నటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









