Actress Ranya Rao: రన్యారావు కేసులో కీలక పరిణామం.. నటి ప్రైవేటు భాగాల్లో ఆ గాయలు.. అసలేం జరిగిందంటే..?

Ranya rao smuggling case: కన్నడ నటి రన్యారావు ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే డీఆర్ఐ పోలీసులు రన్యారావును  అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు. ఆమెకు కోర్టు రిమాండ్ విధించింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 8, 2025, 12:04 PM IST
  • రన్యారావు ఘటనలో బిగ్ ట్విస్ట్..
  • వెలుగులోకి వస్తున్న విస్తుపోయే విషయాలు..
Actress Ranya Rao: రన్యారావు కేసులో కీలక పరిణామం.. నటి  ప్రైవేటు  భాగాల్లో ఆ గాయలు.. అసలేం జరిగిందంటే..?

Kannada actress Ranyarao smuggling case update: కన్నడ నటి రన్యారావు స్మగ్లింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం ఈ అంశం రాజకీయాలతో పాటు.. ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారింది. రన్యారావు ఇటీవల దుబాయ్ నుంచి వస్తు.. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో గోల్డ్ ను అక్రమంగా తరలిస్తు దొరికిపోయింది.దీంతో ఆమెను డీఆర్ఐ పోలీసులు అరెస్ట్ చేశారు.

Add Zee News as a Preferred Source

కొన్నిరోజులుగా ఆమెపై డీఆర్ఐ అధికారులు ప్రత్యేంగా నిఘా పెట్టారు. ఆమె గతంలో 30 సార్లు కూడా దుబాయ్ కువెల్లివచ్చినట్లు గుర్తించారు. ఆమె ఒకే రకమైన దుస్తులు వేసుకుని వెళ్లడం, వస్తుండటంతో పోలీసులు అనుమానం బలపడింది.ఈ క్రమంలో ఇటీవల ఆమెను కెంపెగౌడలో విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని ఆమె నుంచి 14.2 కిలో బంగారంను స్వాధీనం చేసుకున్నారు.

బంగరం రవాణా తర్వాత డీఆర్ఐ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.  దుబాయ్‌తోపాటు గతంలో.. యూరప్‌, అమెరికా, మధ్యప్రాచ్యానికి ఆమె వెళ్లినట్లు తెలుస్తోంది. పలుమార్లు భర్త జతిన్‌ హుక్కేరి కూడా నటి వెంట వెళ్లినట్లు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. మరోవైపు నటి సవతి తండ్రి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రామచంద్రరావు ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు.పెళ్లి తర్వాత ఆమె తమతో అన్నిరకాలుగా కాంటాక్ట్ లను కట్ చేసుకుందని స్పష్టం చేశాడు. 

ఈ కేసులో రన్యారావుకు సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రతి ట్రిప్ కు రన్యారావుకు.. దాదాపు.. 13నుంచి 14 లక్షల రూపాయలు స్మగ్లింగ్ లో వాటా దొరుకుతుందని విచారణలో బైటపడింది.  నటి రన్యారావు పోలీసుల విచారణకు సహాకరిస్తారని చెప్పారు.  తన తండ్రి కేఎస్‌ హెగ్డేష్ స్థిరాస్తి వ్యాపారి అని, భర్త జతిన్‌ హుక్కేరి ఆర్కిటెక్ట్‌ అని, తామంతా బెంగళూరులోనే కలిసి ఉంటున్నట్లు చెప్పారు.

అయితే.. నటి మాత్రం చాలా విషయాలను దాచిపెడుతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నటి కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు సైతం కొట్టేసింది.  ప్రస్తుతం నటి రన్యారావు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. మరోవైపు నటి రన్యారావుకు కన్నడ నుంచి కీలక రాజకీయ నేతలు సహాకరిస్తున్నారని,  దీని వెనుకా పెద్ద మాఫియా ఉందని కర్ణాటక సీఎం న్యాయసలహదారు ఏఎస్ పొన్నన్న బాంబుపేల్చారు .

ఈ క్రమంలో విచారణ సందర్భంగా రన్యారావు శరీరంపై గాయాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అయితే.. ఇవి తనకు గతంలో అయిన గాయాలని.. దీనిపై రన్యారావు మాత్రం స్పష్టంగా వివరాలు చెప్పడంలేదని అధికారులు అంటున్నారు. రన్యారావు ఇంటిని పోలీసులు పరిశీలించారు. ఇప్పటికే ఆమె ఫోన్ లను, లాప్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read more: Sobhita Dhulipala: సమ్మర్ వెకెషన్‌లో చైతు, శోభిత.. సమోసాలు తింటూ చిల్ అవుతున్న క్యూట్ కపుల్.. పిక్స్ వైరల్..

నటి రన్యారావుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక మహిళ కమిషన్ సైతం దీనిపై స్పందించింది. రన్యారావు తమకు ఫిర్యాదు చేస్తే తాము.. ఈఘటలనో కల్పించుకుంటామని తెలిపింది.  ప్రస్తుతం రన్యారావు ఘటన మాత్రం రోజుకో మలుపుతిరుగుతుందని చెప్పుకొవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News