Ranya Rao gold smuggling case: కన్నడ నటి గోల్డ్ స్మగ్లింగ్ ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మార్చి 3న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.12.57 కోట్ల బంగారంతో రన్యారావు పట్టుబడ్డారు. ఆమె గత 15 రోజుల్లో నాలుగు సార్లు, అదే విధంగా ఆరునెలల్లో 30 సార్లు దుబాయ్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.ఈ క్రమంలో దీనిపై డీఆర్ఐ పోలీసులు ప్రత్యేకంగా నిఘాను పెట్టారు.
ఈ నేపథ్యంలో కెంపెగౌడ ఎయిర్ పోర్టులో నటి రన్యారావును అదులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర నుంచి రూ.12.57 కోట్ల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత బెంగళూరులోని ఆమె నివాసం నుంచి మరో 2.06 కోట్ల బంగారం, 2.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా.. రన్యారావుకు కోర్టు రిమాండ్ విధించింది.
తాజాగా రన్యారావు వివాహ వేడుకకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , రాష్ట్ర మంత్రి జి.పరమేశ్వర హాజరైన ఫోటో ఒకటి వెలుగు చూసింది. దీనిపై బీజేపీ నేత మాలవీయ మండిపడుతున్నారు. ఆ నటితో వీరికి ఉన్న సంబంధాలను బైటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. మరొవైపు నటి రన్యారావు.. తాను మొదటి సారి స్మగ్లింగ్ కు పాల్పడినట్లు డీఆర్ఐ అధికారులకు వాంగ్మూలం ఇచ్చింది.
యూట్యూబ్ లో చూసి తాను.. గోల్డ్ ను ఏవిధంగా శరీరంలోపల దాచాలో నేర్చుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా.. దుబాయ్ కు వెళ్లినప్పుడు తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని.. దుబాయ్ లో వాళ్లు చెప్పిన చోట గోల్డ్ తీసుకుని.. బెంగళూరులో వాళ్లు చెప్పిన ప్రదేశానికి వెళ్లి డెలీవరీ చేయాలని చెప్పారని నటి చెప్పింది.
విమానాశ్రయంలో బాత్రూంలలో వెళ్లి.. శరీరం లోపలి భాగాలకు ప్లాస్టర్ లు, బ్యాండెడ్ లతో పెట్టుకుని గోల్డ్ రవాణా చేసేదాన్నని నటి రన్యరావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ప్రస్తుతం డీఆర్ఐ అధికారులు రన్యారావు ల్యాప్ టాప్ , ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. దీనిలో ఉన్న నంబర్ లు, పలు కీలక డాక్యుమెంట్ లను పరిశీలిస్తున్నారు. రన్యారావు ఫోన్ లో ఉన్న నెంబర్ లను పోలీసులు ట్రాక్ చేస్తున్నారు.. రన్యారావు కేసులో ఇంకా పెద్దవాళ్ల హస్తం ఉందా.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









