Beauty Movie Latest Updates: అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర జంటగా.. భలే ఉన్నాడే ఫేమ్ జేఎస్‌ఎస్ వర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ బ్యూటీ. వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్‌పై అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మించారు. బీఎస్ రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పని చేస్తున్నారు. ఆర్‌వి సుబ్రహ్మణ్యం కథ, స్క్రీన్‌ప్లేని అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా మరో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
కన్నమ్మ కన్నమ్మ.. అంటూ సాగే ఈ పాటను సనారే రాయగా.. ఆదిత్య ఆర్కే, లక్ష్మీ మేఘన ఆలపించారు. విజయ్ బుల్గానిన్ సమకూర్చిన బాణీలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. సాహిత్యం, పిక్చరైజేషన్, హీరోహీరోయిన్స్ కెమిస్ట్రీ సూప్‌గా సెట్ అయింది. ఆయ్, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం వంటి సూపర్ హిట్ సినిమాలతో తనదైన మార్క్ క్రియేట్ చేశాడు అంకిత్ కొయ్య. ఈ సినిమాతో సోలో హీరోగా హిట్ అందుకునేలా కనిపిస్తున్నాడు. నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
సినిమాటోగ్రాఫర్‌గా శ్రీ సాయి కుమార్ దారా వ్యవహరిస్తుండగా.. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా బేబీ సురేష్ భీమగాని వర్క్ చేస్తుండగా.. ఎడిటింగ్ బాధ్యతలు ఎస్‌బి ఉద్ధవ్ నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాదిలో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
టెక్నికల్ టీమ్:
==> మాటలు, దర్శకత్వం: జె.ఎస్.ఎస్. వర్ధన్
==> ప్రొడ్యూసర్స్: అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్
==> బ్యానర్లు: వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్, మారుతీ టీమ్ ప్రొడక్ట్
==> స్టోరీ, స్క్రీన్ ప్లే: ఆర్‌వి సుబ్రహ్మణ్యం
==> ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.ఎస్. రావు
==> DOP: శ్రీ సాయి కుమార్ దారా
==> మ్యూజిక్: విజయ్ బుల్గానిన్
==> ఎడిటర్: SB ఉద్ధవ్
==> ఆర్ట్ : బేబీ సురేష్ భీమగాని
==> PRO: సాయి సతీష్
Also Read: AP Aqua Industry: 'డొనల్డ్ ట్రంప్ దెబ్బకు అల్లాడుతున్నాం.. కాపాడండి': సీఎం చంద్రబాబు లేఖ
Also Read: Telangana Inter Results 2025: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు ఎక్కడ చెక్ చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









