Kannappa: డైనమిక్ హీరో విష్ణు మంచు కలల ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డా. మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్యాన్ ఇండియా లెవల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప టీం పాల్గొంది.
ఈ కార్యక్రమంలో విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘నేను చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి భక్తుడిని. కానీ కన్నప్ప సినిమాతో చేసిన ప్రయాణంతో శివ భక్తుడిగా మారిపోయాను. కన్నప్ప సినిమా అందరినీ ఆకట్టుకోవడం పక్కా. ప్రభాస్ పాత్రను ఎంత ఊహించుకున్నా.. అంతకు మించి అనేలా ఉంటుంది. కన్నప్ప ప్రయాణంలో నేను ఎంతో నేర్చుకున్నాను. ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా కన్నప్ప భారీ ఎత్తున విడుదల కాబోతుందన్నారు.
దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘2015లోనే విష్ణు ఈ కన్నప్ప ఈ స్టోరీని చెప్పాను. 2016 జనవరిలో నేను శ్రీ కాళ హస్తికి వెళ్లి శివుడ్ని దర్శనం చేసుకున్నాను. ఆ శివుడే నన్ను ఈ ప్రాజెక్ట్‌లోకి పంపించాడనుకుంటా. అదే శివ లీల. మహా భారతం సీరియల్‌ను అందరూ ప్రేమించారు. కన్నప్పని కూడా అదే స్థాయిలో అందరూ ప్రేమిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి మహామహులను ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందన్నారు.
రఘుబాబు మాట్లాడుతూ.. కన్నప్ప వంటి పౌరాణిక చిత్రంలో యాక్ట్ చేసే ఛాన్స్ రావడం నా పూర్వ జన్మ సుకృతం. కన్నప్ప సినిమా అద్భుతంగా వచ్చింది. విష్ణు బాబు ఈ మూవీ తర్వాత మరో స్థాయికి వెళ్తారు. కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న రాబోతోంది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ‘కన్నప్ప లాంటి చరిత్రలో నిలిచిపోయే చిత్రంలో భాగం అయినందకు సంతోషంగా ఉందన్నారు. తనకు పిలిచి ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా అందరి కెరీర్ కన్నప్పకి ముందు.. కన్నప్పకి తరువాత అన్నట్టుగా మారుతుంది. నా బర్త్ డే సందర్భంగా కన్నప్పను రిలీజ్ చేస్తున్నారు. విష్ణు నటన చూసి అంతా ఫిదా కావడం పక్కా. మైండ్ బ్లోయింగ్ అనేలా సినిమా ఉంటుందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









