Kannappa Movie Trailer: అద్దిరిపోయిన కన్నప్ప ట్రైలర్.. ప్రభాస్ పాత్ర ఏమిటో తెలుసా?

Kannappa Movie Trailer Out Here Review Rating: కొన్ని దశాబ్దాల కింద విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న 'కన్నప్ప' సినిమాను మళ్లీ మంచు విష్ణు తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ విశేషాలు తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 14, 2025, 07:20 PM IST
Kannappa Movie Trailer: అద్దిరిపోయిన కన్నప్ప ట్రైలర్.. ప్రభాస్ పాత్ర ఏమిటో తెలుసా?

Prabhas As Rudra In Kannappa Movie: నాస్తికుడు అయిన ఓ తెగకు చెందిన వేటగాడు చివరకు శివుడికి పరమభక్తుడిగా మారడం 'కన్నప్ప' సినిమా. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్‌ అగర్వాల్‌ వంటి స్టార్ నటులు నటించిన ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. జూన్ 27వ తేదీన విడుదల కాబోతున్న కన్నప్ప సినిమా ట్రైలర్‌ ఎలా ఉందో చూద్దాం. ఇందులో ప్రభాస్‌ పాత్ర ఎలా ఉందో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

Also Read: Anushka Shetty: 'వేశ్య'గా అనుష్కను చూసి ఘోరం.. నడిరోడ్డుపై 40 యాక్సిడెంట్లు

'దేవుడు లేడు.. దేవుడు లేడు.. అది ఒట్టి రాయి రాయి' అంటూ బాల తిన్నడు దేవత విగ్రహాన్ని కొడుతూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఓ గూడెంలో నివసించే తిన్నడు (మంచు విష్ణు) చిన్నప్పటి నుంచి దేవుడిని విశ్వసించాడు. పెద్దయిన తర్వాత కూడా దేవుడిని నమ్మకపోవడం కారణంగా గూడెం నుంచి బహిష్కరణకు గురవుతాడు. అదే సమయంలో నెమలి (ప్రీతి ముకుందన్‍)తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని కాపురం చేస్తుంటాడు. ఆ సమయంలో గూడెంలో ఉన్న వాయులింగం తీసుకెళ్లడానికి కొందరు దాడి చేయడం.. గూడెన్ని కాపాడడానికి తిన్నడు ఏం చేశాడనేది ట్రైలర్‌లో చూపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే శివుడు(అక్షయ్ కుమార్) రుద్ర(ప్రభాస్)ని భూమ్మీదకు పంపించడం.. రుద్రతో తిన్నడు పోరాటం అనేవి కీలకంగా ఉన్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. మిగతా కథ ఏమిటో సినిమా చూడాల్సిందే.

Also Read: Tatkal Ticket Rules: రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌! తత్కాల్ టికెట్ బుకింగ్‌కు కొత్త రూల్స్‌

మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప తెరకెక్కుతోంది. ట్రైలర్‌ చూస్తుంటే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ప్రభాస్ రుద్ర పాత్రలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించాడు. ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈనెల 27వ తేదీన విడుదల కానుంది. ఇక త్వరలో సినిమా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లో భారీ ఈవెంట్‌ నిర్వహించే అవకాశం ఉంది. మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల కొన్ని వివాదాలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సినిమాను విడుదల చేసేందుకు విష్ణు సిద్ధమవుతున్నాడు.

ట్రైలర్ చూడండి.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News