Kannappa Release Date: మంచు డ్రీం ప్రాజెక్టుగా కన్నప్ప సినిమా రాబోతుంది. ఇప్పటికే కన్నప్పపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ తో పాటు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు సినిమాలో భారీ స్టార్ క్యాస్ట్ ఉండటంతో ఈ సినిమా అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇప్పటికే విడుదలైన పాటలు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా యూనిట్ .. దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు.
మోహన్ బాబు, విష్ణు, ప్రభుదేవా వంటి వారు యూపీ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా కన్నప్ప సినిమా గురించి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కన్నప్ప టీంను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాదరంగా ఆహ్వానించారు. అంతేకాదు యూపీ సీఎం ఆతిథ్యానికి కన్నప్ప టీం ఫిదా అయింది. ప్రముఖ చిత్రకారుడు రమేష్ గొరిజాల గీసిన చిత్రపటాన్ని యూపీ సీఎంకు మోహన్ బాబు బహూకరించారు. అనంతరం కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
జూన్ 27న కన్నప్ప చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు కన్నప్ప చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మంచు విష్ణుతో పాటు ఇతర ముఖ్యపాత్రల్లో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్స్ నటించిన సంగతి తెలిసిందే.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









