Kannappa: మోహన్ బాబు నిర్మాతగా మంచు విష్ణు భారీగా నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి వివిధ భాషలకు చెందిన స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయ. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ తో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ సినిమాలో విష్ణు నటన, మ్యూజిక్, ఇతర నటుల సీన్స్ తో పాటు...ఆఖరిలో ప్రభాస్ లుక్ టీజర్ కు హైలెట్ గా ఉన్నాయి. కాగా...ఇప్పటికే రిలీజ్ అయిన శివ,శివ శంకరా సాంగ్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మోహన్ బాబు మరో ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాతో మంచు విష్ణు కుమారుడు, మోహన్ బాబు మనవడు అవ్రామ్ భక్త పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది.
బాలీవుడ్ డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న కన్నప్ప లేటెస్ట్ టీజర్ ఆసక్తికరంగా సాగింది. విష్ణు నటన, టీజర్ విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. తిన్నడు పాత్రలో మంచు విష్ణు ఆహార్యం ఆకట్టుకునేలా ఉంది. తన వారి కోసం ఎంతటి వారినైనా ఎదిరించే ధీరుడి పాత్రలో విష్ణు ఆకట్టుకున్నాడు.
ఆపద వచ్చిన ప్రతిసారి వీరుల తలలు కోరుకునే ఈ రాయి దేవత కాదు' అనే విష్ణు డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంది. అంతటి నాస్తికుడు మీకు భక్తుడవుతాడా? అని శివుడి భార్యగా పార్వతి పాత్రలో నటించిన కాజల్ చెప్పే డైలాగ్ సైతం ఆసక్తిగా ఉంది. ఈ టీజర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే భక్తి, త్యాగం మరియు గొప్పతనం యొక్క చారిత్రక కథనాన్ని చెప్పే దిశగా సాగింది.
టీజర్ చివర్లో ప్రభాస్ 'డివైన్ గార్డియన్' రుద్రుడిగా కనిపించిన విజువల్స్ కన్నుల పండుగలా అనిపిస్తోంది. అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో మంచి ఆహార్యాన్ని, గాంభీర్యాన్ని కనబరిచాడు. మోహన్ లాల్ కిరాతక పాత్రలో కనిపించనున్నాడు. ఇకపోతే, ఈ మూవీ ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. దాంతో మేకర్స్ వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఇటీవలే కన్నప్ప నుండి రిలీజ్ చేసిన శివా శివా శంకరా అంటూ సాగిన పాట శ్రోతలను వీపరీతంగా ఆకట్టుకుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను విజయ్ ప్రకాష్ పాడారు. ప్రభుదేవా పాటని కొరియోగ్రాఫ్ చేశారు. స్టీఫెన్ దేవస్సీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ పాట చూసి ఆడియన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. యూట్యూబ్లో ఒక్క నెగిటివ్ కామెంట్ లేకుండా పాట సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు టీజర్ వంతు....ఎలాంటి అంచనాలు క్రియేట్ చేయనుందో అని ఆసక్తి కలిగిస్తోంది.
ఈ భక్తి రస ప్రాజెక్ట్లో పలు ఇండస్ట్రీల స్టార్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మంచు మోహన్ బాబు, శరత్ కుమార్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ భాగమయ్యారు. ఈ సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ నటిస్తుండగా రుద్రగా ప్రభాస్ కనిపిస్తున్నాడు.కిరాతక పాత్రలో మోహన్ లాల్ కనిపిస్తున్నాడు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవస్సే మ్యూజిక్, బీజీఎం అందిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరి మంచు ఫ్యామిలీలోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టు గా వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









