Kannappa:డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీ నుంచి విడుదలైన రెండు పాటలకు, టీజర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ అప్డేట్ వచ్చింది. "మహాదేవ శాస్త్రి పరిచయ గీతం"ను మార్చి 19న డాక్టర్ ఎం. మోహన్ బాబు బర్త్ డే సందర్బంగా విడుదల చేయనున్నారు. మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడమే కాకుండా మహాదేవ శాస్త్రి పాత్రను కూడా పోషించారు. ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర అని చెప్పాలి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేయనుండటం విశేషం.
డాక్టర్ ఎం. మోహన్ బాబుతో పాటుగా ఈ చిత్రంలో విష్ణు మంచు టైటిల్ రోల్ పోషించారు. ఈ సినిమాలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అటు కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడిగా ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోంది.
The roar of Mahadeva Shastri is echoing... ?
Faith and fury unite in the #MahadevaShastri Intro Lyrical Song from #Kannappa?, releasing on 19th March ?
Brace yourself for the Shaivite storm!⏳ 2 DAYS TO GO
Har Har Mahadev ?
Har Ghar Mahadev ?@themohanbabu @iVishnuManchu… pic.twitter.com/oDwzw7jir3— Kannappa The Movie (@kannappamovie) March 17, 2025
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ .. పార్వతి దేవి పాత్రలో నటిస్తోంది. ముఖేష్ రిషి తో పాటు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు మిస్టర్ స్టీఫెన్ దేవస్సీ స్వరపరిచిన పాటలు ఇప్పటికే ఆడియన్స్ ను అలరించాయి. ఇక ఇప్పుడు మూడో పాటగా మహ దేవ శాస్త్రి పరిచయ గీతాన్ని విడుదల చేయనున్నారు. కన్నప్ప చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై డాక్టర్ పద్మశ్రీ మోహన్ బాబు నిర్మించారు. ముకేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసారు. ఏప్రిల్ 25న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.ఈ సినిమా విడుదల సందర్భంగా మంచు విష్ణు ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శిస్తున్నారు. అటు కన్నప్ప సొంత ఊరులోని శివాలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే కదా.
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









