Kantara 2 Television Premiere: బుల్లితెర ప్రీమియర్ కి రెడీ అయిపోయిన కాంతరా 2 సినిమా.. మీ జీ తెలుగులో ఎప్పుడంటే..?

Kantara 2 Television Premiere: థియేటర్లు, ఓటీటీల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషనల్ మూవీ కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1 ఇప్పుడు జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా వస్తోంది.రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.  

Written by - Vishnupriya | Last Updated : Jan 21, 2026, 07:32 PM IST
Kantara 2 Television Premiere:  బుల్లితెర ప్రీమియర్ కి రెడీ అయిపోయిన కాంతరా 2 సినిమా.. మీ జీ తెలుగులో ఎప్పుడంటే..?

Kantara 2 Television Premiere: తెలుగు ప్రేక్షకులకు.. మరో మంచి వినోదాన్ని అందించేందుకు జీ తెలుగు సిద్ధమైంది. ఈ వారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానున్న సినిమా కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1. ఈ సినిమా ఈ శనివారం..జనవరి 24న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో మాత్రమే ప్రసారం కానుంది.

Add Zee News as a Preferred Source

కాంతారా మొదటి భాగం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. కన్నడ సినిమా ఇండస్ట్రీలో మొదటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా ఈ చిత్రం నిలిచింది. అయితే ఈ సినిమా రెండో భాగం కూడా అంతటి విజయమే సాధించి మరోసారి కన్నడ ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాత పెంచింది. కాంతారా 2 సినిమా భారీ అంచనాల మధ్య విడుదల మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

థియేటర్లలో..ఓటీటీల్లో ఇప్పటికే భారీ స్పందన పొందిన ఈ సినిమా ఇప్పుడు టీవీ ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ఈ సినిమాకు హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా కథ, సంస్కృతి.. సంప్రదాయాల నేపథ్యంతో సాగుతుంది.

కథ విషయానికి వస్తే.. కాంతార ప్రాంతాన్ని రాజశేఖర్ అనే రాజు పరిపాలిస్తుంటాడు. ఆ అడవులు మొత్తం రాజవంశం ఆధీనంలోనే ఉంటాయి. అదే ప్రాంతంలో బర్మ అనే వ్యక్తి జీవితం సాగిస్తుంటాడు. ప్రజల కోసం రాజ్యంలోకి వెళ్లి వ్యాపారం చేసే బర్మ జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. ఈ ప్రయాణంలో అతడికి కనకావతి అనే యువతితో పరిచయం పెరుగుతుంది. ఆ తర్వాత జరిగే సంఘటనలే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

అసలు బర్మ ఎవరు? అతని గతం ఏమిటి? కనకావతి పాత్ర వెనుక ఉన్న నిజం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా తప్పక చూడాలి. రిషబ్ శెట్టితో పాటు రుక్మిణీ వసంత్, జయరామ్, రాకేష్ పూజారి వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

సంగీతాన్ని బి. అజనీష్ లోక్‌నాథ్ అందించగా, భావోద్వేగాలు కలిసిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సంస్కృతి, సంప్రదాయాలు, కథా బలం కలిసిన ఈ సినిమాను ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో మిస్ కాకండి.

Read more: Uttar Pradesh: వామ్మో.. ఈమె నిజంగా దెయ్యమేమో.!. మొగుడి ఆ పార్ట్ ను కొరికి విసిరేసిన భార్య.. ఎందుకో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News