)
Kantara Chapter 1 1st Week Collections: ‘కాంతార ఛాప్టర్ 1’సినిమాపై ముందు నుంచి ప్యాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలే ఉన్నాయి.ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూల్లతో దూసుకుపోతుంది. తెలుగులో ఓ పక్క పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ మూవీ హవా ఉన్న దాన్ని తట్టుకొని ఇక్కడ ఓ రేంజ్ లో వసూళ్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే రజినీకాంత్ ‘కూలీ’ మూవీ ఓవరాల్ తెలుగు కలెక్షన్స్ ను ఫస్ట్ వీక్ లోనే దాటేసింది. తెలుగులో రిలీజైన వన్ ఆఫ్ ది బెస్ట్ సౌత్ డబ్బింగ్ సినిమాల్లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ లో ఒకటిగా నిలిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే కూలీ తెలుగులో రూ. 44 కోట్ల షేర్ అందుకుంటే.. కాంతార ఛాప్టర్ దాదాపు రూ. 50 కోట్ల షేర్ (రూ. 77 కోట్ల గ్రాస్ ) వసూళ్లతో గత్తర లేపుతోంది.
ఇక కన్నడలో ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ చిత్రం ఓవరాల్ గా ఫస్ట్ వీక్ లో రూ. 115 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంటే.. ‘కాంతార ఛాప్టర్ 1’ మొదటి వారంలోనే రూ. 118 కోట్ల గ్రాస్ వసూళ్లతో నెంబర్ వన్ గా నిలిచింది. ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర మన దేశంలో రూ. 103.10 కోట్ల నెట్ వసూల్లు.. రూ. 120 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ము దుమారం రేపింది. ఓవర్సీస్ లో దాదాపు రూ. 72 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక తమిళనాడులో రూ. 35 కోట్ల గ్రాస్.. కేరళతో రూ. 35 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారంలో రూ. 455 కోట్ల గ్రాస్ (రూ. 225 కోట్ల షేర్ ) రాబట్టింది. రిషబ్ శెట్టి ఈ సినిమాలో సంప్రదాయాలు, పంజుర్లి, భూతకోళ వంటి పూర్తిగా జానపద నేపథ్యంలో ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించాడు. ఏది సీజీ.. ఏది అసలు అనేది నమ్మశక్యం కానీ విధంగా తెరకెక్కించి మేకర్ గా మంచి మార్కులే కొట్టేశాడు.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 340 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అడ్వాన్స్ బేసిస్ పేరిట చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రూ. 342 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ బరిలో దిగిన ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ దగ్గర రూ. 117 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇక నిన్న గురువారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 14 కోట్ల షేర్ (రూ. 25 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయి. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా $ 3 మిలియన్ యూఎస్ డాలర్స్ రాబట్టి సంచలనం రేపింది. ఓవరాల్ గా సెకండ్ సాధించే వసూళ్లతో ‘కాంతార ఛాప్టర్’ ఏ మేరకు ఎంత వరకు వసూళ్లను రాబడుతుందనేది చూడాలి. ఓవరాల్ గా ఈ యేడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన ‘ఛావా’ మూవీ కలెక్షన్స్ ను దాటి అత్యధిక వసూళ్లను రాబడుతుందా లేదా అనేది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.