)
Kantara chapter 1 Rishab Shetty appeal to fans: దసరా పండగకు కానుకగా విడుదలైన కాంతారా చాప్టర్ 1 మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ మీద కొత్త ట్రెండ్ చేస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం 500 కోట్ల క్లబ్ లో చేరే దిశగా వసూళ్లను రాబడుతుంది. కన్నడ నటుడు, రిషభ్ శెట్టి రచయిత, దర్శకత్వం, హీరోగా నటించిన కాంతారా చాప్టర్ 1 సినిమా చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
ముఖ్యంగా రిషభ్ శెట్టి నటనకు, రుక్మిణి వసంత్ కూడా తోడవ్వడంతో అభిమానులు మూవీని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్లు ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ గా కన్పిస్తున్నాయి. అయితే.. కొన్ని చోట్ల అభిమానులు కాంతారా లోని పంజూర్లీ దైవంలా డ్రెస్, కాస్ట్యూమ్ లు వేసుకుని వస్తున్నారు. పంజూర్లీని దైవంను ఇమిటేట్ చేస్తున్నారు. దీనిపై మూవీ టిమ్ తో పాటు, రిషభ్ శెట్టికి కూడా అభిమానులకు కీలక అప్పీల్ చేశారు.
రిషభ్ శెట్టి మాట్లాడుతూ.. థియేటర్లకు పంజుర్లీ దైవ వేషధారణలో రావద్దని ఆయన కోరారు. ఈ క్రమంలో ఒకింత అసహానంకు కూడా గురైనట్లు సమాచారం. దైవ వేషధారణ అనేది తమ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదని, దానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని ఆయన గుర్తుచేశారు. సినిమా థియేటర్లకు దైవ వేషాలతో రావడం ఆ సంప్రదాయాన్ని కించపర్చినట్లవుతుందని అన్నారు.
దయచేసి అలాంటి పనులు చేయకండి. మనం ఆ పుణ్యాన్ని, పవిత్రతను కాపాడుకోవాలని అభిమానులను అభ్యర్థించారు. కాంతారా మొత్తం నమ్మకం, సంప్రదాయాలు చుట్టునే తిరుగుతుందన్నారు. దయచేసి అభిమానులు ఎవరుకూడా ఇలాంటి పనులు చేయోద్దని రిషభ్ శెట్టి,మూవీ టీమ్ ప్రత్యేకంగా అభ్యర్థించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook