)
Kantara Chapter 1 Review: ‘కాంతార’ మూవీతో ప్రేక్షకులను కొత్తలోకంలోకి తీసుకెళ్లిన రిషబ్ శెట్టి.. తాజాగా కాంతార ముందు ఏం జరిగిందనే కాన్సెప్ట్ తో ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా ‘కాంతర’ ఛాప్టర్ 1 లెజెండ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో రిషబ్ శెట్టి ప్రేక్షకులను మాయ చేసాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
‘కాంతార’ ప్రాంతంలో ఉన్న శివ గణాలకు కాపాలగా ఉంటారు అక్కడ ప్రజలు. అక్కడి దేవుడిని సొంత చేసుకోవాలని అదే ప్రాంతానికి బాంద్రా ప్రాంతానికి చెందిన రాజు.. అక్కడే ఉన్న మరో తెగ ఆ దేవుడిని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఈ మూడు తెగల మధ్య జరిగిన పోరాటమే ‘కాంతార ఛాప్టర్ 1’ లెజెండ్ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
కాంతార స్టోరీతో ప్యాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులను కొత్తలోకంలోకి తీసుకెళ్లిన రిషబ్ శెట్టి.. ఇపుడు ‘కాంతార ఛాప్టర్ 1 లెజెండ్’ తో మరోసారి మాయ చేసాడనే చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఆటవిక తెగకు చెందిన ప్రజలకు సంబంధించిన ఆహార్యం (కాస్ట్యూమ్స్),విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మంచి శ్రద్ద కనబరిచాడు. అయితే ఫస్టాఫ్ లో ఏదో రొటిన్ గా కాంతార ప్రాంతానికి చెందిన బర్మి (రిషబ్ శెట్టి) బాంద్రా రాజ్యంలోకి అడుగుపెట్టడం.. ఆ తర్వాత యువరాణి కనకవతి (రుక్మిణి వసంత్)కు చేరువ అవుతాడు. అక్కడ బందర్ (పోర్ట్)లో తమ ప్రాంతానికి చెందిన సరుకులను అమ్ముకునే స్థాయికి ఎదుగుతాడు. మన దేశ వాణిజ్యంలో వస్తువు మార్పిడి విధానాన్ని కాంతారలో చూపించాడు. ఫస్ట్ హాఫ్ లో మొత్తం కూడా బాహుబలి 2 ఛాయలు అక్కడక్కడ కనిపిస్తాయి. ఫస్టాఫ్ ముందు వచ్చే ఇంటర్వెల్ ముందు ఇచ్చే ట్విస్ట్ తో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.నెక్ట్స్ ఏం జరుగుందనేదానిపై ఉత్కంఠ కలిగించాడు.
కాంతార మాదిరే ఈ ప్రీక్వెల్ లో కూడా సెకండాఫ్ పైనే పెద్ద ఫోకస్ గా పెట్టాడు రిషబ్ శెట్టి. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది. మధ్యలో కామెడీ ట్రాక్ కూడా పెట్టాడు. అక్కడక్కడ పేలింది కూడా. ఆ తర్వాత దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ చేసి ఎలా దేవుడిలో బర్మి కలిసిపోతాడనేది ప్రేక్షకులకు అదో ట్రాన్స్ లోకి తీసుకెళ్లాడు. క్లైమాక్స్ ఫైట్ కూడా బాహుబలిని దృష్టిలో పెట్టుకొని తీసినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా దేవుడున్నడానే విషయాన్ని ఈ చిత్రంతో చూపెట్టడం ఆస్తుకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇందులో కాంతార తెగను కాపాడే ఓ పులి ఉంటుంది. అది కాంతార తెగ వాళ్లను ఆపద సమయాల్లో కాపాడుతూ ఉంటుంది. అలాంటి కొన్ని సీన్స్ లాజిక్స్ కు అందవు. మరోవైపు అడవులో మరో తెగకు చెందిన ప్రజలు తాంత్రిక విద్యలతో దేవుడిని వశం చేసుకోవడం వంటివి తెరపై ఆకట్టుకునే విధంగా ఉంది. చందమామ కథలో మాదిరి తెరపై అలా మాయ చేసాడు. అదేదో సినిమాలో లాజిక్ అడక్కు అన్నట్లు కొన్ని సీన్స్ విషయంలో ప్రేక్షకులు తమ దిమాగ్ కు పక్కన పెట్టి చూడాల్సిందే. ఇందులో అజనీష్ లోకనాథ్ రీ రికార్డింగ్, మ్యూజిక్ బాగుంది. సినిమాకు ప్రాణంగా నిలిచింది. హోంబలే ఫిల్మ్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. అరవింద్ కశ్యప్ ఫోటోగ్రఫీ ఆకట్టుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. దర్శకుడిగా రిషబ్ శెట్టి తన మార్క్ నటనతో పాటు దర్శకుడిగా తన విజన్ ఏంటో తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కానీ కాంతార సినిమాను ఊహించుకుని వెళ్లిన వాళ్లకు ఆ రేంజ్ మజా దక్కుతుందా అంటే చెప్పలేము.
నటీనటుల విషయానికొస్తే..
రిషబ్ శెట్టి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా యువరాజు కులశేఖరుడిని చంపే సీన్ లో అతడి నటన పీక్స్ లో ఉంటుంది. మరోవైపు క్లైమాక్స్ లో కూడా అతని నటనను మెచ్చుకోకుండా ఉండలేము. నేషనల్ అవార్డ్ మరోసారి గ్యారంటీ అనే విధంగా రిషబ్ శెట్టి నటుడిగా దర్శకుడిగా సత్తా చాటాడు. రుక్మిణి వసంత్ నటన బాగుంది. గ్లామర్ తో పాటు నటనకు ఆస్కారమున్న పాత్రలో మెప్పించింది. మంచి భవిష్యత్తు ఉన్న నటి. రాజుగా జయరామ్.. యువరాజుగా కులశేఖరుడిగా గుల్షన్ దేవయ్య నటన బాగుంది. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు. ముఖ్యంగా కామెడీ చేసిన నటుడతో పాటు హీరో గ్యాంగ్ తమ నటనతో మెప్పించారు.
ప్లస్ పాయింట్స్
రిషబ్ శెట్టి నటన
ఇంటర్వెల్ ట్విస్ట్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ ల్యాగ్
లాజిక్ కు అందని సీన్స్
పంచ్ లైన్.. ‘కాంతార’ మెప్పించే డేవోషనల్ ఫాంటసీ యాక్షన్ డ్రామా..
రేటింగ్ : 3/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.