Karate Kids Legends: ఆసక్తి రేకిస్తోన్న ‘కరాటే కిడ్: లెజెండ్’ మూవీ ట్రైలర్.. మే 30న విడుదల..

Karate Kids Legends Trailer Talk: భారతదేశంలో ఎక్కువ  ప్రాచుర్యం పొందిన ఫ్రాంచైజీ మూవీస్ లో ఒకటైన  ‘కరాటే కిడ్’ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న కొత్త మూవీ ‘కరాటే కిడ్‌: లెజెండ్స్’ మూవీకీ సంబంధించిన  తెలుగు ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 3, 2025, 12:10 AM IST
Karate Kids Legends: ఆసక్తి రేకిస్తోన్న ‘కరాటే కిడ్: లెజెండ్’  మూవీ ట్రైలర్.. మే 30న విడుదల..

Karate Kids Legends Trailer Talk: కరాటే కిడ్ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు లేనట్టుగా  ఈ ఆరవ భాగంలో రెండు ఐకానిక్‌ పాత్రలు — జాకీ చాన్ (Mr. Han),  రాల్ఫ్ మాకియో (Daniel LaRusso) కలిసి తొలిసారి స్క్రీన్‌పై అలరించబోతున్నారు. తాజాగా ట్రైలర్‌లో  ఆయా పాత్రలకు వారు కష్టపడిన  విధానం, వారి కఠోర శిక్షణ, మిస్టర్ మియాగీ లెగసీకి ఘన నివాళిని ఈ సినిమాను రూపొందించారు.  ఈ సినిమాను 2025 మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

Add Zee News as a Preferred Source

ఈ కథ లీ ఫాంగ్ (బెన్ వాంగ్) అనే కుంగ్‌ ఫూ నేపథ్య కేంద్రంగా సాగుతుంది. అతడు తన తల్లితో కలిసి న్యూయార్క్‌ నగరానికి వచ్చి ఓ ఫేమస్ స్కూల్ లో  చేరతాడు. అక్కడ ఒక విద్యార్థిని, ఆమె తండ్రితో స్నేహం ఏర్పడుతుంది. అయితే ఒక లోకల్‌ కరాటే చాంపియన్‌తో గొడవలు మొదలవ్వడం అతని లైఫ్ ను తలకిందులు చేస్తుంది. ఆ తరువాత జరిగిందేమిటి అనేది ట్రైలర్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు.  తనను తానే రక్షించుకోవాలనే ఉద్దేశంతో.. లీ ఫాంగ్‌ కుంగ్‌ ఫూ గురువు మిస్టర్ హాన్,  లెజెండరీ కరాటే కిడ్ డేనియల్ లారూసోల నుంచి శిక్షణ తీసుకుంటాడు. ఇద్దరితో అతడు ఓ అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్‌ పోరుకు సిద్ధమవ్వనున్నాడు. ఈ ఏపిసోడ్‌ అందర్ని ఎంతో అలరించేలా ఉంది.

జొనథన్ ఎన్‌ట్‌విసిల్ డైరెక్ట్  వహిస్తున్న ఈ చిత్రంలో జాకీ చాన్, రాల్ఫ్ మాకియో, బెన్ వాంగ్, జోషువా జాక్సన్, సేడీ స్టాన్లీ, మింగ్-నా వెన్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు.

కరాటే కిడ్‌: లెజెండ్స్ అనేది మంచి యాక్షన్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోని భావోద్వేగాలు, సాంప్రదాయ విలువలు లెగసీకి గౌరవం తెలియజేసే డిఫరెంట్ సినిమా అని చెప్పాలి.తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడం గ్యారంటీ అని చెప్పాలి. పాత తరం అభిమానులు,  కొత్త తరం ప్రేక్షకులందరిని ఈ సినిమా అలరిస్తుందనడంతో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News