Karisma Kapoor husband Sunjay Kapoor Passes Away : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని 90లలో ఏలిన కరిష్మా కపూర్.. దాదాపు 90 శాతం సక్సెస్ రేట్ తో నెంబర్ వన్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ కరిష్మా కపూర్ భర్త సంజయ్ కపూర్.. లండన్ లో పోలో ఆడుతూ ఆడుతూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడ సిబ్బంది ఆయన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించినట్టు వైద్యలు తెలిపారు. దీంతో బాలీవుడ్ లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సంజయ్ కపూర్ వయసు 53 సంవత్సరాలు. గురువారం రాత్రి లండన్ లో ఈయన మృతి చెందారు. కరిష్మా, సంజయ్ ల వివాహాం 2003లో జరిగింది. 2016లో ఇద్దరి మధ్య వైషమ్యాలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కరిష్మాతో విడాకుల తర్వాత సంజయ్.. ప్రియ సచ్ దేవ్ ను రెండో వివాహాం చేసుకున్నారు. కరిష్మా మాత్రం రెండో పెళ్లికి దూరంగా ఉంది. అప్పట్లో సంజయ్ .. తనను వేలం వేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ వేలంలో తనను దక్కించుకున్న వారి పక్కలో పడుకోమని తన భర్త ఫోర్స్ చేసాడని చెప్పింది. అతని బుద్ధి తెలిసి అతనికి విడాకులు ఇచ్చినట్టు పలు సందర్బాల్లో ప్రస్తావించింది.
ప్రస్తుతం కరిష్మా కపూర్.. మన దేశంలోనే ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. ఇదెలా ఉంటే కరిష్మా మాజీ భర్త సంజయ్ (Sunjay Kapur) పోలో ప్లేయర్. గురువారం పోలో ఆడుతుండగానే అతను కుప్పకూలిపోయినట్టు అక్కడి వాళ్లు తెలిపారు. ఆయన ఆడుతూ ఉండగా.. ఓ తేనెటీగ అతని నోటిలోకి వెళ్లడంతో సడెన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందని పలు మీడియా ఛానెల్స్ చెప్పాయి. అప్పటికే వైద్యులు అతన్ని కాపాడే ప్రయత్నం చేసినా.. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది.
పృథ్వీరాజ్ కపూర్ మునిమనవరాలు.. రాజ్ కపూర్ మనవరాలు.. రణ్ ధీర్ కపూర్ కూతురు అయిన కరిష్మా కపూర్.. వెంకటేష్ హీరోగా రామానాయుడు నిర్మించిన ‘అనాడి’ చిత్రంతో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసింది. అనాడి మూవీ తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘చంటి’ మూవీకి రీమేక్. ఈమె చెల్లెలు కరీనా కపూర్ బాలీవుడ్ అగ్ర కథానాయికగా సత్తా చాటింది. కరిష్మా బాబాయి కుమారుడు రణ్ బీర్ కపూర్ (యానిమల్ హీరో) హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా సత్తా చాటుతున్నాడు.
Also Read: ఈ పుట్టినరోజు నందమూరి బాలకృష్ణకు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..!
Also Read: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఆ రికార్డు ఎన్టీఆర్, బాలకృష్ణలకు మాత్రమే సొంతం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.









