)
ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘కర్మణ్యే వాధికారస్తే’. అమర్ దీప్ చల్లపల్లి డైరెక్ట్ చేశారు. డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. అక్టోబర్ 31న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా తాజాగా సన్ నెక్స్ట్ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది. అక్కడ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.
ఈ సందర్భంగా దర్శకుడు అమర్ దీప్ చల్లపల్లి మాట్లాడుతూ "మా కర్మణ్యే వాధికారస్తే థియేట్రికల్ గా రిలీజైంది. మంచి రివ్యూస్ వచ్చాయని చెప్పుకొచ్చారు. చూసిన ప్రేక్షకులు మంచి సినిమా చూసామన్నారు. ఇపుడీ చిత్రం సన్ నెక్స్ట్ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లో చూడని వారు సన్ నెక్స్ట్ ఓటిటి లో చూసిఈ సినిమా చూసి ఎంజాయ్ చేయమని చెప్పుకొచ్చారు.
నిర్మాత డి ఎస్ ఎస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ .. "మా కర్మణ్యే వాధికారస్తే చిత్రాన్ని ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేట్రికల్ గా మంచి స్పందన లభించింది. 100 థియేటర్స్ లో విడుదలైన సినిమా తాజాగా సన్ నెక్స్ట్ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది.
సినిమా కథ విషయానికొస్తే.. వైజాగ్ లో అమ్మాయిలు అనుమానాస్పదంగా చనిపోతుంటారు. అయితే ఈ వ్యక్తులకు సంబంధించిన అన్ని అడ్రస్ ఫేక్ అని తెలుస్తాయి. మరోవైపు మన దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన అధికారులను హనీ ట్రాప్ చేయడానికి శత్రువు అమ్మాయిలను ఎరగా వేస్తుంటారు. వారిని కౌంటర్ చేయడానికి ఎన్ఐఏ అధికారి జిష్ణు తన తోటి అధికారితో కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. మరోవైపు అనుమానాస్పద వ్యక్తుల మరణాల వెనక పెద్ద నెట్ వర్క్ ఉంటుందనే విషయం అసిస్టెంట్ కమిషనర్ కు తెలుస్తుంది. మరో కేసుకు సంబంధించి సస్పెండ్ అయిన కానిస్టేబుల్ (బ్రహ్మాజీ) తన వంతుగా ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేస్తాడు. చివరకు దేశ ద్రోహుల ఆటను వీళ్లు ఎలా బట్టబయలు చేసారన్నదే ఈ సినిమా స్టోరీ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.