
Kamal Haasan: ‘నాయకుడు’ సినిమా తర్వాత కమల్ హాసన్.. ఎన్నో ఏళ్ల తర్వాత మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ సినిమా చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోసన్ లో భాగంగా కమల్ హాసన్.. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగాయి. దీంతో కర్ణాటకు చెందిన కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ సినిమా విడుదలను ఆపేయలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన కర్ణాటక హై కోర్టు కమల్ హాసన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కమల్ హాసన్ అంటే మాకు గౌరవం ఉంది. ఆయన పెద్ద నటుడైన ప్రజల మనోభావాలను కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు. సారీ చెబితే మొత్తం సమస్య పరిష్కారమయ్యేదన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని వ్యాఖ్యానించింది. మీరు ఏ ప్రాతిపదికన ఆ ప్రకటన చేశారని ప్రశ్నించింది. ఏది కర్ణాటకలో మీ సినిమా విడుదల కావాలంటే క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ తీర్పు ఇచ్చింది.
థగ్ లైఫ్ విషయానికొస్తే.. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాను మణిరత్నం దర్శకత్వం వహించారు. త్రిష, శింబు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.