Keep The Fire Alive: సంయుక్త సమర్పణలో కీప్ ది ఫైర్ అలైవ్…ఆలోచింపజేసే సందేశంతో..!

Keep The Fire Alive Short Film "కీప్ ది ఫైర్ అలైవ్" అనేది కేవలం ఒక లఘు చిత్రం కాదు. ప్రతి మహిళ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూనే నిలబడాలనే సందేశం ఇది. సమాజంలో మహిళలపై దాడులు తగ్గాలంటే మౌనం కాదు, ప్రతిఒక్కరూ స్పందించాలి. ఈ ఫిల్మ్ ప్రతి ఒక్కరికి స్పూర్తి కలిగించే అద్భుతమైన ప్రయత్నం. ఈ సినిమా గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Written by - Vishnupriya | Last Updated : Mar 8, 2025, 07:03 PM IST
Keep The Fire Alive: సంయుక్త సమర్పణలో కీప్ ది ఫైర్ అలైవ్…ఆలోచింపజేసే సందేశంతో..!

Samyuktha short film
సినిమా ద్వారా సామాజిక స్పృహ పెంచే ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి ఓ విప్లవాత్మక షార్ట్ ఫిల్మ్ "కీప్ ది ఫైర్ అలైవ్". ఇది కేవలం 1 నిమిషం 25 సెకండ్ల లఘు చిత్రం మాత్రమే కాదు, ఒక గొప్ప సందేశాన్ని సొసైటీ కి అందించే ప్రయత్నం. కె ప్రఫుల్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, లైంగిక వేధింపుల సమస్యను సున్నితంగా, గంభీరంగా ఆవిష్కరించింది.  

Add Zee News as a Preferred Source

ఈ షార్ట్ ఫిల్మ్ కథాంశం సమాజంలో జరిగే అన్యాయాలపై ప్రశ్నించేలా ఉంటుంది. హీరోయిన్ సంయుక్త, ఈ చిత్రం కథకు, అర్థానికి ఆకర్షితమై, దీన్ని సమర్పించేందుకు ముందుకు వచ్చారు. సమాజంలో మార్పు రావాలంటే కేవలం చట్టాలు సరిపోవు, ప్రజల్లో స్పృహ పెరగాలి అనే ఉద్దేశంతో ఈ చిత్రం రూపొందింది.  

దర్శకుడు కె ప్రఫుల్ చంద్ర మాట్లాడుతూ, "లైంగిక వేధింపుల సమస్యపై మనమందరం ఒకే దిశగా కదలాలి. చట్టాలు కఠినంగా ఉండటం కంటే, ప్రజల్లో మార్పు రావడం ముఖ్యమే. మనం మనుషులం, విలువలు మరచిపోకుండా మెలగాలి," అని అన్నారు.  

ఈ షార్ట్ ఫిల్మ్ విజయంలో టెక్నికల్ టీమ్ పాత్ర విశేషమైనది. మౌర్య సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉండి, ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా కనిపించేలా చేశారు. చేరుబ్ శిర్షత్ అందించిన సంగీతం ప్రతీ సన్నివేశానికి ప్రాణం పోసింది. గ్యారేజ్ స్టూడియోలో ఎడిటింగ్, VFX సౌండ్ మిక్సింగ్ ప్రొఫెషనల్ లెవెల్‌లో చేశారనే చెప్పాలి.  

ఇక షేక్ హాసన్, అంకిత్ సిద్ధార్థ, సఫా, వినోద్ లాంటి నటీనటుల సమిష్టి కృషి ఫిల్మ్ ను మరింత ప్రత్యేకంగా మార్చింది. కృషి చెన్నోజు డిజైన్ చేసిన లోగో ఫిల్మ్ కథకు అచ్చంగా సరిపోతుంది. లక్షిత్, చైతన్య DI వర్క్ నాణ్యతతో, విజువల్స్ మరింత హైలైట్ అయ్యాయి.  

"మన చుట్టూ అనేక సమస్యలు ఉన్నా, అవి మారాలంటే మనం ముందడుగు వేయాలి. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి 1743లో తొలి అడుగు పడితే, ఫలితం 1947లో వచ్చింది. అలాగే, ఇప్పుడు మనం మార్పు కోసం ప్రయత్నిస్తే, రేపటి తరానికి మంచి భవిష్యత్తు లభిస్తుంది," అని దర్శకుడు చెబుతున్నారు.  

సంయుక్త ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా తన వాయిస్ ఓవర్ తో కొత్త శక్తిని తీసుకువచ్చారు. ఆమె ప్రతీ మాటలో ఒక సందేశం ఉంది. ఇది కేవలం షార్ట్ ఫిల్మ్ మాత్రమే కాదు, మహిళా శక్తిని చాటే ఓ గొప్ప ప్రయత్నం.  సంయుక్త "ఆదిశక్తి ఫౌండేషన్" ద్వారా మహిళా సాధికారత కోసం ముందడుగు వేస్తున్నారు. "ఇలాంటి ఫిల్మ్స్ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం నా బాధ్యతగా భావిస్తున్నా" అని సంయుక్త తెలిపారు.

Read more: Israeli Tourist Gang raped: ఉమెన్స్‌డే వేళ దారుణం.. ఇద్దరు యువతులపై గ్యాంగ్ రేప్.. ఎక్కండంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News