
Keerthy Suresh eating ice cream video viral: కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. తన చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్ ను ఆంటోనీ తట్టిల్ ను గతేడాది గోవాలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి హిందు, క్రిస్టియన్ సంప్రదాయల ప్రకారం జరిగింది. ఈ క్రమంలో కీర్తిసురేష్ తన పెళ్లి జరిగాక కూడా ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా బాలీవుడ్ లో తన ఫస్ట్ మూవీ బేబీ జాన్ కోసం ప్రమోషన్లలో పాల్గొన్నారు. మహానటి మంగళసూత్రం ధరించి.. బేబీజాన్ ప్రమోషన్లలో పాల్గొనడం అప్పట్లో సంచలనంగా మారింది.
అయితే.. బేబీజాన్ మాత్రం అనుకున్నంత హిట్ సాధించలేదు. అయిన కూడా కీర్తిసురేష్ ఏమాత్రం తగ్గెదేలా అన్నవిధంగా తన భర్త ఆంటోనీ తట్టిల్ తో కలిసి ఇటీవల సమ్మర్ వెకెషన్ కు వెళ్లింది. తన వైవాహిక జీవితం గురించి కీర్తి సురేష్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది.
పెళ్లైన తర్వాత తనదే డామినేషన్ అంటూ కూడా చెప్పుకొవచ్చింది. ఆంటోనీ తట్టిల్ కు చాలా సిగ్గేక్కువ అని మహానటి తన భర్త బండారం బైటపెట్టింది. అయితే.. తాజాగా.. కీర్తి సురేష్ ఒక ఐస్ క్రీమ్ షాపుకు వెళ్లింది. అక్కడ షాపు వెండర్ కు కీర్తిసురేష్ తనకు నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లెవర్ ఇవ్వాలని కోరింది. కానీ అతను మాత్రం మహనటిని ఆటపట్టించాడు.
Keerthy Suresh flips the script! ?? When the ice cream vendor trolls, but she trolls right back! @KeerthyOfficial#KeerthySuresh #ReverseUno #IceCreamWars #siima pic.twitter.com/f65oE7Z1Zq
— SIIMA (@siima) March 20, 2025
ఐస్ క్రీమ్ ఇచ్చినట్లే ఇచ్చి..కాసేపు ఆటపట్టించాడు. ఒక నోక సందర్భంలో కీర్తిసురేష్ చేతిని సైతం పట్టుకున్నాడు. ఇక కీర్తి సురేష్ కూడా.. ఏ మాత్రం తగ్గకుండా.. అతనికి కౌంటర్ ఇచ్చింది. మొత్తంగా తనకు కావాల్సిన ఐస్ క్రీమ్ ను తీసుకుంది. ఆ తర్వాత తీసుకున్న ఐస్ క్రీమ్ కు డబ్బులు ఇవ్వకుండా.. షాపు వెండర్ కు చుక్కలు చూపించింది. అతను చూపించిన ట్రీక్ ను అతని మీదనే ప్లే చేసింది. మొత్తంగా కీర్తి సురేష్ ఐస్ క్రీమ్ షాపు వెండర్ కు డబ్బులు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టింది.
చివరకు పోనీలే అనుకుని.. మహానటి.. అతనికి తాను తీసుకున్న ఐస్ క్రీమ్ కు డబ్బులు ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు అట్లుంటదీ మరీ మహానటితో పెట్టుకంటే అని కౌంటర్ లు వేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe