Keerthy Suresh Dance For Subham: సమంత, కీర్తి సురేష్ కొన్ని సంవత్సరాల క్రితం మే 9న విడుదలైన మహానటి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సమంత నిర్మాతగా మారి…తీస్తున్న శుభం సినిమా కూడా మే 9వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ద్వారా సమంత నిర్మాతగా మారబోతోంది.
కరోనా సమయంలో మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సమంత..కొంతకాలం సినిమా నుంచి విరామం తీసుకుంది. ఆ సమయంలో ఎన్నో కథలను విన్న సమంత, 'శుభం' అనే కథ తన మనసును తాకిందని వెల్లడించింది. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని, సాధారణ హారర్ లేదా కామెడీ సినిమా కాదని ఆమె స్పష్టం చేసింది. ఇక అందుకనే తన నిర్మాణ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని ముందుగా ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నాను అని ఈ మధ్య జరిగిన ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడికి ఒక సానుకూలమైన అనుభూతిని కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
Rahul Ravindren Dance For Subham
కాగా ఈ సినిమా ప్రమోషన్స్లో తెగ పాల్గొంటుంది ఈ హీరోయిన్. ఇందులో భాగంగా..వైజాగ్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సమంత స్టేజి మీద డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రమోషనల్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్‌కు టాలీవుడ్‌లోని అనేక ప్రముఖులు స్పందిస్తూ, సమంతకు మద్దతుగా డాన్స్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కీర్తి సురేష్ కూడా ఈ ట్రెండ్‌లో పాల్గొనడం విశేషం. మరోపక్క రాహుల్ రవీంద్రాన్ని కూడా చిన్మయితో, తన పిల్లలతో కలిసి ఈ పాటకు డాన్స్ వేశారు. కీర్తి సురేష్ చాలా ఫాస్ట్ గా డాన్స్ చేయగా.. రాహుల్ రవీంద్రన్ పక్క ఫ్యామిలీ మెన్ లాగా ఈ పాటకు డాన్స్ వేసి ఆకట్టుకున్నారు.
Sreeleela Dance For Subham
కాగా శ్రీ లీల కూడా డాన్స్ వేసి తన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక వీరందరూ సమంతకి సపోర్ట్ గా నిలవడంతో ఆమె అభిమానులు ఆశ్చర్యపోవడమే కాకుండా తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా ఇప్పటికే నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా మంచి ఆదాయం తెచ్చుకున్నట్టు సమాచారం. సమంత పెట్టిన పెట్టుబడి దాదాపు తిరిగొచ్చిందని, థియేటర్ విడుదల ద్వారా ఇక లాభాల దశ ప్రారంభమవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









