Kiara Advani: ‘వార్ 2’ మూవీపై కియారా అద్వానీ ఆశలు.. ఇక ఆ ముద్ర చెరిగిపోతుందా..!

Kiara Advani: కియారా అద్వానీ.. నార్త్ భామ అయిన తెలుగులో కూడా సత్తా చాటింది. ఈ యేడాది రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’మూవీతో పలకరించింది. ఈ చిత్రం ప్యాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అందుకే అప్ కమింగ్ ‘వార్ 2’ మూవీపై భారీ ఆశలే పెట్టుకుంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 22, 2025, 11:15 AM IST
Kiara Advani: ‘వార్ 2’ మూవీపై కియారా అద్వానీ ఆశలు.. ఇక ఆ ముద్ర చెరిగిపోతుందా..!

Kiara Advani: కియారా అద్వానీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నా.. ప్యాన్ ఇండియా సక్సెస్ లు మాత్రం లేవు. ఈ ఇయర్ ప్యాన్ ఇండియా లెవల్లో రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో ‘గేమ్ ఛేంజర్’ మూవీపై కియారా ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. అవన్నీ వమ్ము అయ్యాయి. అందుకే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి సౌత్, నార్త్ సూపర్ స్టార్స్ కలయికలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కించారు. ఇక ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ లో ఓ సీన్ లో కియారా టూ పీస్ బికినీలో కనిపించి మైండ్ బ్లాంక్ చేసింది. 

పెళ్లైన తర్వాత హీరోయిన్స్ ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి వెనకాడుతారు. కానీ కియారా మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా ఈ సీన్ లో కనిపించి వావ్ అనిపించింది. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ తో ప్యాన్ ఇండియా హీరోయిన్ గా తొలి సక్సెస్ అందుకోవాలని చూస్తోంది. పైగా ఈ సినిమాకు దక్షిణాదిలో ఎన్టీఆర్ అదిపెద్ద ఫ్యాక్టర్. నార్త్ లో హృతిక్ రోషన్ కలవడంతో ఈ సినిమా తొలి రోజు మన దేశంలో రూ. 100 కోట్ల నెట్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి పోటీగా రజినీకాంత్ కూలీ మూవీ ఉన్నా.. ఈ సినిమాపై పెద్దగా ఇంపాక్ట్ ఉండదనే చెప్పాలి. కేవలం తమిళంలో మాత్రమే ఈ సినిమాకు థియేటర్స్ దొరకడం కష్టమనే చెప్పాలి. ఈ సినిమా సక్సెస్ అనేది ఎన్టీఆర్, హృతిక్ తో పాటు కియారా కు ఎంతో కీలక అనే చెప్పాలి. 

కియారా విషయానికొస్తే.. తెలుగులో మహేష్ బాబు హీరోగా  కొరటాల శివ డైరెక్షన్ లో  తెరకెక్కిన ‘భరత్ అను నేను’ చిత్రంతో టాలీవుడ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో  తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆపై గేమ్ ఛేంజర్ మూవీతో పలకరించింది. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే కియారా.. తన తోటి యాక్టర్ సిద్ధార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెద్దలను ఒప్పించి  మ్యారేజ్ చేసుకుంది. వీరి మ్యారేజ్ 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్యఘర్ ప్యాలెస్ లో గ్రాండ్ గా జరిగింది. కియారా అద్వానీ.. 2014లో హిందీ చిత్రం ‘ఫగ్లీ’ చిత్రంతో కథానాయికగా వెండితెర అరంగేట్రం చేసింది. ఎం.ఎస్.ధోని జీవితం మీద తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని’ అన్ టోల్డ్ స్టోరీ చిత్రంతో బాలీవుడ్ లో ఫస్ట్ సక్సెస్ అందుకుంది. అటు సినిమాల్లోనే కాకుండా..ఇటు లస్ట్ స్టోరీస్ వంటి వెబ్ సిరీస్ లో హాట్ హాట్ గా నటించి అగ్గి రాజేసింది. మొత్తంగా గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తోన్న కియారాకు ‘వార్ 2’ మూవీ పెద్ద సక్సెస్ ను అందిస్తుందా లేదా అనేది చూడాలి. 

Also Read : అప్పట్లో విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య.. అసలు ఏం జరిగిందంటే..

Also Read : ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించే ఏకైక శాండల్‌వుడ్ నటి.. వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News