Bhagyashri Borse Video: విమానం నుంచి దూకేసిన భాగ్య శ్రీ బొర్సె.. హీరోలే వణికిపోయేలా స్టంట్.. వీడియో వైరల్..

Bhagyashri borse skydivint stunt:  కింగ్ డమ్ హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సె దుబాయ్ కు వెళ్లింది. అక్కడ స్కై డైవింగ్ చేసి అందర్ని షాకింగ్ కు గురిచేసింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.

Written by - Inamdar Paresh | Last Updated : May 14, 2025, 04:15 PM IST
  • భాగ్యశ్రీబొర్సె డెరింగ్ స్టంట్..
  • వైరల్గా మారిన వీడియో..
Bhagyashri Borse Video: విమానం నుంచి దూకేసిన భాగ్య శ్రీ బొర్సె.. హీరోలే వణికిపోయేలా స్టంట్.. వీడియో వైరల్..

bhagyashri borse skydiving stunt video: భాగ్య శ్రీ బొర్సె మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ లోఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ.. విజయ్ దేవర కొండతో కలిసి కింగ్ డమ్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా.. రామ్ పోతినేని స‌ర‌స‌న ఒక సినిమాలో చేస్తునే,  మరోవైపు.. దుల్క‌ర్ స‌ల్మాన్ 'కాంత' చిత్రంలో ఈ భామ నటిస్తు చేతి నిండా సినిమాలతో ఈ భామ బిజీగా ఉంటుంది.  

Add Zee News as a Preferred Source

అయితే.. తాజాగా.. భాగ్యశ్రీబొర్సె దుబాయ్ కు వెళ్లింది. అక్కడ స్కై డైవింగ్ చేసింది. ఈ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసి అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది. ఈ క్రమంలో స్కై డైవింగ్‌ లో.. ఒక గైడ్ తో పాటు.. భాగ్యశ్రీబొర్సె.. స్క్రై డైవింగ్ చేసింది. ఆమె స్టంట్ చూస్తుంటే..  అభిమానులు షాక్ అవుతున్నారు. హీరోలు సైతం.. ఇలాంటి స్టంట్ లుచేయడానికి సాహాసం చేయరు. అలాంటిది భాగ్యశ్రీ బొర్సె చాలా సింపుల్గా.. ఈ స్కై డైవింగ్‌ జంప్ చేసి అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు భాగ్యశ్రీబొర్సె డేరింగ్ కు ఫిదా అవుతున్నారు.

 

మరికొందరు జాగ్రత్త.. తేడా అయితే.. కష్టం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగ్య శ్రీ బొర్సె విజయ్ దేవర కొండతో కలిసి.. కింగ్ డమ్ మూవీలో నటిస్తుంది. ఇటీవల మూవీ టీమ్.. టీజర్ ను,పాటల్ని విడుదల చేసిన విషయం తెలిసిందే.

Read more: Santhanam Song Controversy Video: తిరుమల శ్రీవారి పాటపై దారుణమైన లిరిక్స్.. హీరో సంతానం ఏమన్నాడంటే..?.. వీడియో వైరల్..

ఈ మూవీలో విజయ్ దేవర కొండ, భాగ్యశ్రీ బొర్సెతో లిప్ లాక్ సన్ని వేశాలు ఉన్నాయి. వీటిపై సోషల్ మీడియాలో పెద్దరచ్చ జరిగింది. విజయ్, రష్మిక ల మధ్య భాగ్యశ్రీ చిచ్చుపెట్టిందని.. కొంత మంది ట్రోల్స్ చేశారు. వీరి మధ్య రొమాన్స్ చూశాక.. రష్మిక.. విజయ్ ను దూరంగా  పెట్టిందని..ఫోన్ కూడా ఎత్తట్లేదని కూడా రూమర్స్ వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ భామ.. స్కై డైవింగ్‌ స్టంట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News