
Kiran Abbavaram Wife : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'దిల్ రూబా' సినిమా మార్చి 14న విడుదలైంది. ఈ సినిమా విడుదలైన తొలి షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన.. ఈ చిత్రానికి విశ్వ కరుణ్ దర్శకత్వం వహించాడు. హీరోయిన్గా రుక్సార్ థిల్లాన్ నటించగా, శివమ్ సెల్యులాయిడ్స్, సారెగమ, ఏ యూడ్లీ ఫిల్మ్ బ్యానర్స్‌పై ఈ చిత్రం నిర్మితమైంది.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కిరణ్ అబ్బవరం పలు ఇంటర్వ్యూల్లో తన అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యంగా మలయాళ హిట్ మూవీ 'మార్కో' గురించి చెప్పిన విషయాలు ఆసక్తిగా మారాయి. కిరణ్ తన భార్య రహస్య గోరఖ్‌తో కలిసి ఈ సినిమాను చూడటానికి వెళ్లాడని, కానీ సినిమాలో హింస ఎక్కువగా ఉండటంతో ఆమె అసౌకర్యంగా ఫీలై, మధ్యలోనే బయటకు వచ్చేశామని తెలిపారు.
ఇలాంటి సినిమాల ప్రభావం ప్రేక్షకులపై పూర్తిగా పడకపోవచ్చని, కానీ కొంతమందిపై మాత్రం ప్రభావం చూపుతుందని కిరణ్ అభిప్రాయపడ్డారు. "సినిమాల్లోని పాటలు, సీన్స్ ప్రేక్షకులను ఆకర్షించాయి. అయితే హింస ఎక్కువగా ఉన్నప్పుడే కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు అసహజంగా ఫీలవుతారు" అని అన్నారు.
కిరణ్ అబ్బవరం నటించిన 'దిల్ రూబా' ఇప్పటికే ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. తొలి రోజు నుంచే మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమాలో నజియా, సత్య, జాన్ విజయ్, నరైన్, క్రాంతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇటీవల కిరణ్ అబ్బవరం తన భార్య గర్భంతో ఉందని సోషల్ మీడియాలో ప్రకటించారు. త్వరలోనే కిరణ్ కి బిడ్డ పుట్టబోతోందని ఆయన అభిమానులు ఎంతో సంతోషంగా. ఈ క్రమంలో 'దిల్ రూబా' కూడా మంచి కలెక్షన్ సాధిస్తే.. కిరణ్ కి డబుల్ హ్యాపీ న్యూస్ లు రావడం ఖాయం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe