Kishkindhapuri OTT Streaming On ZEE5: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, మకరంద్ దేశ్‌పాండే లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన చిత్రం కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి డైరెక్ట్ చేసిన ఈ హారర్-థ్రిల్లర్ థియేటర్లో సంచలన విజయాన్ని అందుకుంది. థియేటర్లో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించిన ఈ చిత్రం త్వరలో జీ5లో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ OTT ప్లాట్‌ఫామ్ ZEE5లోకి ఈ నెల 17న స్ట్రీమింగ్ కు రాబోతుంది. అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటల నుండి ‘కిష్కింధపురి’ని స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రంలో థియేటర్లలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని ఇక ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్‌ఫాంలోకి అడుగు పెట్టబోతుంది.
రేడియో స్టేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చిందనే చెప్పాలి. సినిమాను థియేటర్స్ లో చూసిన ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించే ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు రెడీ గా ఉంది.
ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ .. “నేను ఇప్పటి వరకు చేసిన అత్యంత కఠినమైన పాత్రలలో ఇది ఒకటి. ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు సెట్‌లో మన ముందు ఎలాంటి భయానక పరిస్థితులు ఉండవు. కానీ మేం మాత్రం ఊహించుకుని అలా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. నటుడిగా, అది నన్ను నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకొచ్చింది.సెట్‌లో నేను భయం,అనిశ్చితి వాతావరణంలో బతికాను. రేడియో స్టేషన్ వింతైన వాతావరణం నాతో పాటు ఇంకా అలాగే ఉంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఓటీటీలో కూడా ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను.
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ..‘‘కిష్కింధపురి’లో నా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. లుక్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. రకరకాల ఎమోషన్స్‌ను పోషించే అవకాశం నాకు ఈ చిత్రంతో దక్కిందనే చెప్పాలి. ఇందులో నా పాత్ర ‘హారర్ హీరోయిన్’ స్టీరియోటైప్ పాత్ర కాదన్నారు. కొన్ని సార్లు నన్ను భయపెట్టింది. ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ను తప్పక అలరిస్తుందనే నమ్మకం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితమైన ఈ సినిమా హృదయ విదారక దృశ్యాలు, ప్రేక్షకులను చివరి వరకు ఊహించని కథాంశంతో ఎంగేజ్ చేస్తుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా హర్రర్ ప్రియులకు తప్పక నచ్చుతుందని చెప్పుకొచ్చారు.
Read more: గోవా నుంచి మన రాష్ట్రానికి ఎంత మద్యం తీసుకురావచ్చో తెలుసా..! చట్టం ఏం చెబుతోందంటే..
Read more: మన దేశంలో అత్యంత సంపన్న మంత్రులు వీళ్లే.. లిస్టులో తెలుగు వాళ్లే టాప్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









