)
Kishkindhapuri Review: బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తొలి సినిమా ‘అల్లుడు శీను’ సినిమాలో సమంత హీరోయిన్.. తమన్నా ఐటెం సాంగ్ తో అందరి దృష్టి ఆకర్షించాడు. ఆ తర్వాత వరుసగా చిత్రాలతో పలకరించాడు. సినిమా ఏదైనా స్టార్ హీరోయిన్స్ మాత్రం ఇతని సినిమాలో ఉండేవారు. కానీ రాను రాను హీరోయిన్స్ పై ఉన్న శ్రద్ధ స్క్రిప్ట్ పెడితే బాగుండేదనే టాక్ కూడా వినిపించింది. మధ్యలో ‘జయ జానకి రామ’ ‘రాక్షసుడు సినిమాలతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత హిట్ అనేది బెల్లంకొండకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. రీసెంట్ గా ‘భైరవం’ మూవీతో పలకరించాడు.
ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా.. ఎందుకో బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదు. ‘భైరవం’ సినిమా తర్వాత బెల్లంకొండ తాజాగా కైశిక్ పెగలపాటి డైరెక్షన్ లో ‘కిష్కింధపురి’ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాను సాహు గారపాటి నిర్మించారు. బెల్లంకొంగ గత చిత్రం రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్ గా రూ. 9 కోట్ల షేర్ రాబట్టి ఫ్లాప్ గా నిలిచింది. ఈ సారి ‘కిష్కింధపురి’ సినిమా అన్ని ఏరియాల్లో ఓన్ గానే రిలీజ్ చేసుకుంటున్నారు.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.50 కోట్ల రాబడితే హిట్ అనిపించుకుంటుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. రాక్షసుడు సినిమా కూడా ఇదే రేంజ్ లో బిజినెస్ సొంతం చేసుకోవడమే కాదు.. టార్గెట్ ను రీచ్ అయి హిట్ అనిపించుకుంది. ఇపుడు అదే బెల్లంకొండ, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రం ఈ టార్గెట్ ను ఈజీగా అందుకుంటుందా లేదా అనేది చూడాలి. మొత్తంగా ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా ఈ టార్గెట్ ను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.