Koragajja:‘కాంతార’ ను మించిన ‘కొరగజ్జ’.. త్వరలో విడుదల..

Koragajja: కన్నడ నాట ప్రస్తుతం రూటెడ్ కథలు రాజ్యమేలుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిన ‘కాంతార’ మూవీ పెద్ద విజయం సాధించింది. కాంతార తో పాటు కాంతర ఛాప్టర్ 1 ప్రేక్షకులను అలరించాయి. ఈ క్రమంలో మరో విలేజ్ రూటెట్ మూవీ ‘కొరగజ్జ’ రాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 14, 2025, 05:11 PM IST
Koragajja:‘కాంతార’ ను మించిన ‘కొరగజ్జ’.. త్వరలో విడుదల..

Koragajja:కన్నడ సీమలో ప్రస్తుతం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో గ్రామ దేవతల నేపథ్యంలో వచ్చిన ‘కాంతార’ రెండు చిత్రాలు సంచలన విజయం సాధించాయి.  భూతకోళ అంటూ ‘కాంతార’ భారతీయ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక కర్ణాటక, కేరళ, ముంబైలోని కొన్ని ప్రాంతాలు, మరీ ముఖ్యంగా తులునాడులో పూజించబడే దైవం ‘కొరగజ్జ’. ఈ నేపథ్యంలో కన్నడలో ఓ సినిమా రాబోతుంది.  ‘కొరగజ్జ’ అనే టైటిల్‌తో రానున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై త్రివిక్రమ్ సాపల్య నిర్మాతగా సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ తెరకెక్కిస్తున్నారు. 

Add Zee News as a Preferred Source

ఈ చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. రీసెంట్‌గానే ఆడియో లాంఛ్‌ను మంగళూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాత్రధారులు విభిన్న గెటప్స్‌లో కనిపించి కనువిందు చేశారు. కొరగజ్జ థీమ్‌లో అందరూ ఈవెంట్‌లో సందడి చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలోని పాటల్ని షారోన్ ప్రభాకర్, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, అర్మాన్ మాలిక్, స్వరూప్ ఖాన్, అనిలా రాజీవ్, సుధీర్ అత్తవర్ వంటి వారు ఆలపించారు. జీ మ్యూజిక్ ద్వారా ‘కొరగజ్జ’ ఆడియో మార్కెట్లో రిలీజైంది. 

నిర్మాత త్రివిక్రమ్ సాపల్య మాట్లాడుతూ.. ‘‘కొరగజ్జ’ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. మేం రిలీజ్ చేసిన పోస్టర్, 3డీ మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.  అందరినీ సర్ ప్రైజ్ చేసేలా మా మూవీ ఉంటుందన్నారు. 

దర్శకుడు సుధీర్ అత్తవర్ మాట్లాడుతూ.. ‘కన్నడ పరిశ్రమలో ముప్పై ఏళ్ల క్రితమే పాన్ వరల్డ్ చిత్రాలు వచ్చాయి. ‘నాగరహోలి’ అనే సినిమా ప్రపంచ వ్యాప్తంగా 13 భాషల్లో విడుదలైంది. కన్నడలో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. అందులో ‘కాంతార’ కూడా ఒకటి. కన్నడ నుంచి వచ్చిన కల్పనా మనకు రష్యాలో అంబాసిడర్‌గా ఉండేవారు. మాకు ఎక్కువగా జ్ఞాన పీఠ అవార్డులు వచ్చాయి. ఇక ఇప్పుడు మా నుంచి ‘కొరగజ్జ’ చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమా చూసి ఆదరించండని చెప్పారు. ఈ చిత్రం మిమ్మల్ని నిరాశ పరచదు. అందరినీ మెప్పిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. 

నటి శృతి మాట్లాడుతూ .. ‘‘కొరగజ్జ’ లాంటి అద్భుతమైన చిత్రంతో నాకు పాత్ర దొరకడం ఆనందంగా ఉందన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. కన్నడలో ప్రస్తుతం ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి.  మన భారత సంస్కృతి, ఆచారాల్ని చాటే చిత్రాలెన్నో వస్తున్నాయి. ‘కాంతార’ తరువాత కన్నడ నుంచి ‘కొరగజ్జ’ రాబోతోంది. అందరూ చూసి ఆదరించండన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, మోషన్ పోస్టర్‌లు ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని పెంచేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Read more: రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటిని చూశారా.. ఏకంగా మాహిష్మతిని తలదన్నేలా ఉన్న రాజా సాబ్ భవనం..!

Read more: ప్రభాస్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా..! అస్సెట్స్ విషయంలో నిజంగానే బాహుబలి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News