Kousalya Tanaya Raghava: కౌసల్య తనయ రాఘవ ట్రైలర్ విడుదల.. తెలుగు ప్రేక్షకులకు అలరించనున్న ఫీల్ గుడ్ సినిమా..!

Kousalya Tanaya Raghava Trailer: ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ‘కౌసల్య తనయ రాఘవ’ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ప్రస్తుతం రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.  

Written by - Vishnupriya | Last Updated : Apr 6, 2025, 11:12 AM IST
Kousalya Tanaya Raghava: కౌసల్య తనయ రాఘవ ట్రైలర్ విడుదల.. తెలుగు ప్రేక్షకులకు అలరించనున్న ఫీల్ గుడ్ సినిమా..!

Feel-good Telugu films: వెండితెరపై మాస్, యాక్షన్, కామెడీ చిత్రాల హవా నడుస్తున్న ఈ కాలంలో, ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయడం సులభం కాదు. అయినా కూడా ఈ ప్రయత్నంలో ఆడియెన్స్ మనసుల్ని గెలవాలని వస్తోంది ‘కౌసల్య తనయ రాఘవ’ సినిమా. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే బాధ్యతలు స్వామి పట్నాయక్ స్వయంగా నిర్వహించారు. అడపా రత్నాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Add Zee News as a Preferred Source

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై మంచి ఆసక్తి రేపాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ ఆసక్తిని మరింత పెంచింది. ట్రైలర్ ప్రారంభం నుంచే సినిమాకి ఓ మంచి ఎమోషనల్ టోన్ ఉన్నట్టుగా అనిపిస్తోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమ కథతో పాటు ఓ బలమైన మెసేజ్ ఉండేలా ట్రైలర్‌ను కట్ చేశారు.

 

ఈ చిత్రంలోని ప్రధాన బలంగా నటన, విజువల్స్, సంగీతం నిలుస్తాయని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. రాజేష్, శ్రావణి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. 80వ దశకంలో జరిగిన కథను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించారు. చదువుపై ఉన్న ప్రధానమైన సందేశాన్ని సున్నితంగా ప్రెజెంట్ చేయడం ప్రత్యేకతగా నిలిచింది.

కెమెరామెన్ యోగి రెడ్డి అందించిన విజువల్స్ కాలాన్ని వెనక్కి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తాయి. సంగీత దర్శకుడు రాజేష్ రాజ్ తేలు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ఎంతో హృద్యంగా ఉన్నాయి. దర్శకుడు స్వామి పట్నాయక్ కథ చెప్పిన తీరు, నటీనటుల అభినయం సినిమాపై మంచి నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.

ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల కానుండగా, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నటీనటులు, సాంకేతిక బృందం స్పందించారు. హీరో రాజేష్ మాట్లాడుతూ, “ఈ చిత్రం నాకు ఎంతో ప్రత్యేకమైనది. అందరూ ఈ సినిమా చూసి ఆశీర్వదించండి” అన్నారు. దర్శకుడు స్వామి పట్నాయక్, నిర్మాత రత్నాకర్ కూడా సినిమా బాగా వచ్చిందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నటుడు ఆర్కే నాయుడు, నటులు చంటి, లోహిత్, మనీషా, మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ తేలు సహా అందరూ ఈ సినిమా తనతన పాత్రకు ప్రత్యేకత ఇచ్చిందని చెప్పారు. కౌసల్య తనయ రాఘవ ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా మార్చి నెల చివర్లో మెల్లగా హైప్ తెచ్చుకుంటూ, ఏప్రిల్ 11న విడుదలకు సిద్ధమవుతోంది.

ఇదీ చదవండి: ట్రంప్‌ సర్కారుపై అమెరికావ్యాప్తంగా భారీ నిరసనలు.. వీడియో వైరల్

ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. ఈరాశికి కుటుంబ సమస్యల నుంచి కాస్త ఉపశమనం..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

 

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News