Sanoj Mishara: డైరెక్టర్ సనోజ్ మిశ్రా అత్యాచారం ఘటనలో బిగ్ ట్విస్ట్.. షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చిన యువతి..!

Monalisa director Sanoj mishra: సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అత్యాచారం ఘటనలో నిన్న( సోమవారం) అరెస్ట్ చేశారు. అయితే.. యువతి పోలీసులకు ఇచ్చిన తాజాగా బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో పోలీసులు సైతం షాక్ కు గురౌతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 1, 2025, 12:50 PM IST
  • సనోజ్ మిశ్రా ఘటనలో కీలక పరిణామం..
  • మాట మార్చిన యువతి..
Sanoj Mishara:  డైరెక్టర్ సనోజ్ మిశ్రా అత్యాచారం ఘటనలో బిగ్ ట్విస్ట్.. షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చిన యువతి..!

Sanoj mishra director arrested case: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో పూసలమ్మడానికి వచ్చిన మోనాలీసా అనేక యువతి ఓవర్ నైట్ లో ఫెమస్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమెకు విపరీతంగా క్రేజ్ వచ్చింది.  ఈ నేపథ్యంలో.. కుంభమేళ వైరల్ యువతి మోనాలీసా భోంస్లేకు తన సినిమాలో చాన్స్ ఇస్తానని దర్శకుడు సనోజ్ మిశ్రా ముందుకు వచ్చారు. తన తర్వాతి సినిమా ది డైరీ ఆఫ్ మణిపూర్ లో మోనాలీసాకు అవకాశం ఇస్తున్నట్లు డైరెక్టర్ ప్రకటించాడు. ఇప్పటికే మోనాలీసా ఇంటికి వెళ్లి కూడా ఆమెతో ఒప్పందం సైతం చేసుకున్నాడు.

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం మోనాలీసాకు నటనలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తనపై అత్యాచారం చేశాడని, సినిమాలో అవకాశాల పేరిట లొంగ దీసుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడి, వీడియోలు తీసి తనను బెదిరిస్తు నీచంగా ప్రవర్తించాడని ఉత్తర ప్రదేశ్ కు చెందిన  ఝాన్సీ ప్రాంతానికి చెందిన యువతి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ క్రమంలో పోలీసులు సనోజ్ మిశ్రాను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సనోజ్ మిశ్రా ఢిల్లీ హైకోర్టులో బెయిల్ దాఖలు చేశారు.

కానీ కోర్టు బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. ఇదిలా ఉండగా.. సనోజ్ మిశ్రాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన  యువతి యూటర్న్ తీసుకుంది. సనోజ్ మిశ్రా మంచివాడని, తనపైన అత్యాచారం చేయలేదని మరో పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది. కొందరు కుట్రపూరితంగా ఆయన్ను ఇరికిస్తున్నారని ఆమె వ్యాఖ్యలు చేసింది. మరీ అత్యాచారం చేయకపోతే.. ఎందుకు కేసు పెట్టినట్లు అంటూ పోలీసులు ఆమెను కౌంటర్ క్వశ్చన్ వేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు సైతం..  ఈ ఘటనపై తలలు పట్టుకుంటున్నారు.

మరోవైపు మోనాలీసా కూడా ఈ ఘటనపై షాకింగ్ లో ఉన్నట్లు తెలుస్తొంది. తనకు అవకాశం ఇస్తానని చెప్పి.. ట్రైనింగ్ లో జాయిన్ చేసిన డైరెక్టర్ జైలుకు వెళ్లడంతో మోనాలీసా ఆందోళనలో ఉన్నారంట. అసలు సనోజ్ మిశ్రాను నమ్మాలా..?.. లేదా అనే దానిపై మోనాలీసా కుటుంబ సభ్యులు సైతం ప్రస్తుతం ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారంట.

Read more: Rashmika Mananna Video: రష్మిక మందన్నకు ఘోర అవమానం..!.. కారులో ఉండగా జబర్దస్తీ చేసిన సల్మాన్ ఖాన్.. ఇదిగో ప్రూఫ్ వీడియో...

ఈ ఘటనతో మోనాలీసా ఆశలపై నీళ్లు వేసినట్లు అయ్యిందని కూడా కొందరు నెటిజన్లు మోనాలీసాకు తమ సానూభూతి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అసలు.. ఆమెను తీసుకొచ్చి అనవసరంగా లేనీ పోనీ  ఆశలు కల్పించి ఆమె జీవితంలో ఆడుకొవద్దని మరికొందరు మోనాలీసాకు జాగ్రత్తలు చెబుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News