Kushal Raju: కుశాల్ రాజు హీరోగా సరికొత్త కాన్సెప్ట్ తో రానున్న సినిమా.. దర్శకుడిగా మల్లిడి కృష్ణ..!

Kushal Raju movie: కుశాల్ రాజు హీరోగా సరికొత్త కాన్సెప్ట్ తో రానున్న సినిమా.. దర్శకుడిగా మల్లిడి కృష్ణ..! ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రం సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సైన్స్ ఫిక్షన్ డ్రామా, స్కైఫై థీమ్‌తో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభవం అందించేందుకు సిద్ధమైంది. మల్లిడి కృష్ణ, పృథ్వీరాజ్, కుశాల్ రాజు, డా. లతారాజు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో ఉన్నారు.

Written by - Vishnupriya | Last Updated : Apr 1, 2025, 12:06 PM IST
Kushal Raju: కుశాల్ రాజు హీరోగా సరికొత్త కాన్సెప్ట్ తో రానున్న సినిమా.. దర్శకుడిగా మల్లిడి కృష్ణ..!

Science Fiction Movie: ప్రముఖ దర్శకుడు మల్లిడి కృష్ణ దర్శకత్వంలో ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 సినిమా సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ చిత్రం కుశాల్ రాజును హీరోగా పరిచయం చేస్తోంది. సైన్స్ ఫిక్షన్ డ్రామా, స్కైఫై థీమ్‌తో రూపొందించిన ఈ చిత్రం, ప్రేక్షకులకు కొత్త అనుభవం అందించేందుకు సిద్ధమైంది.

Add Zee News as a Preferred Source

ఈ చిత్రాన్ని డా. లతారాజు నిర్మిస్తున్నారు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ సినిమా పూజా కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు. స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్, మల్లిడి వశిష్ట, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, బెల్లంకొండ సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. వీవీ వినాయక్ క్లాప్ కొట్టడం, మల్లిడి వశిష్ట ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేయడం వంటి ఘనమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 

ఈ చిత్రం గురించి మల్లిడి కృష్ణ మాట్లాడుతూ, "2012లో నా జర్నీ మొదలైంది. అనేక కష్టాల తర్వాత ఈ స్థాయికి వచ్చాను. నా మొదటి సినిమా పూజా కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది. ఈ సినిమా ఒక స్కైఫై డ్రామా. మా నిర్మాత లత గారు నాకు స్ఫూర్తినిచ్చారు. నేను ఎంచుకున్న కథ ధైర్యంతో కూడుకున్నది, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాను" అని చెప్పారు.

పృథ్వీరాజ్, ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ, "ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయని తెలిసి ఆనందంగా ఉంది. నాకు ఇది రెండవ ఇన్నింగ్స్‌గా భావిస్తున్నాను. డైరెక్టర్ కృష్ణ చాలా ప్రతిభావంతుడు. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది" అని చెప్పారు.

హీరో కుశాల్ రాజు మాట్లాడుతూ, "నేను నటించే పాత్ర చాలా ప్రత్యేకం. నా దర్శకుడు కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి. మా నిర్మాత లత గారు కూడా నాకు ఎంతో అండగా ఉన్నారు" అని చెప్పారు.

డా. లతారాజు నిర్మాణం గురించి మాట్లాడుతూ, "ఈ సినిమా నా జీవితంలో చాలా కొత్త అనుభవం. స్టోరీ వినడంలోనే ఆశ్చర్యపోయాను. పృథ్వీ గారి పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రంలో కామెడీ, ప్రేమ, యాక్షన్ అన్నీ సమన్వయంగా ఉంటాయి" అని అన్నారు.

జీవన్, ఫైట్ మాస్టర్ మాట్లాడుతూ, "ఈ సినిమా కథ వినడం చాలా ఆసక్తికరంగా ఉంది. హీరో కుశాల్ రాజు తను పాత్ర కోసం బాగా శ్రమిస్తున్నారు. ఈ సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాను" అని చెప్పారు.

ఎంఎస్ఆర్ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో.. డాక్టర్ లతా రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ..అమర్నాథ్ బొమ్మిరెడ్డి అందిస్తుండగా.. బాబిరెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో కుశాల్ రాజు (హీరో), జగపతి బాబు, పృథ్వీరాజ్, వైవా హర్ష, బబ్లూ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!

ఇదీ చదవండి:  Jaya Prada Husband: నటి జయప్రద పెళ్లై ముగ్గురు పిల్లల తండ్రిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. షాకింగ్ నిజాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News