L2-Empuraan Trailer Talk Review: ఎల్ 2 ఎంపురాన్ ట్రైలర్ టాక్ రివ్యూ.. మోహన్ లాల్ నట విశ్వరూపం..

L2-Empuraan Trailer Talk Review: భారత దేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్ లాల్ కు ప్రత్యేక స్ఠానం ఉంది. హీరోగా ఓ మూసకే పరిమితం కాకుండా అన్ని జానర్స్ ను టచ్ చేసిన అతికొద్ది నటుల్లో మోహన్ లాల్ ఒకరు. తాజాగా ఇతను ఎల్ 2.. ‘ఎంపురాన్’ మూవీతో పలకరించబోతున్నాడు. లూసీఫర్ మూవీకి ప్రీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల ప్యాన్ ఇండియా భాషల్లో విడుదల చేశారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 20, 2025, 10:52 AM IST
L2-Empuraan Trailer Talk Review: ఎల్ 2 ఎంపురాన్ ట్రైలర్ టాక్ రివ్యూ.. మోహన్ లాల్ నట విశ్వరూపం..

L2-Empuraan Trailer Talk Review: పృథ్వీ రాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమాను తెలుగులో అదే ‘లూసీఫర్’ టైటిల్ తో తెలుగులో డబ్ చేస్తే ఇక్కడ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత చిరంజీవి ఈ సినిమాను ‘గాడ్ ఫాదర్’గా రీమక్ చేస్తే ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అంతపెద్ద సక్సెస్ సాధించిన ఈ సినిమాకు ప్రీక్వెల్ గా ‘ఎల్ 2 ఎంపురాన్’ పేరుతో రాబోతుంది.  ‘చీక‌టి గ్ర‌హాల ఎంపురాన్‌’గా మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్‌, కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్ లాల్ నటించారు. పృథ్వీరాజ్ సుకుమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భారీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.

Add Zee News as a Preferred Source

ఈ ట్రైలర్ లో ‘నా బిడ్డ‌లు కారు న‌న్ను ఫాలో అయితే.. న‌న్ను ఫాలో అయిన‌వాళ్లే నా బిడ్డ‌లు’ ‘పి.కె.రాందాస్‌గారు మిగిల్చి వెళ్లిన ఈ యుద్ధంలో ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్ని శాశ్వ‌తంగా కూల్చాల‌ని ప్ర‌య‌త్నించింది నా ముందు నిల్చుని ఎదిరించిన శ‌త్రువులు కాదు’ అంటూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. దాదాపు 3 నిమిషాల 50 సెకన్ల ట్రైలర్ ఆద్యంతం యాక్షన్, డ్రామాతో నిండిపోయింది. ఇంకా ఈ ట్రైలర్ లో ‘మ‌న‌దేశంలో రాజ‌నీతి ఓ వ్యాపారం’.
‘మ‌నుషుల ప్రాణాల కంటే ఓ ర‌క్త సంబంధానికైనా విలువ ఉంటుంద‌ని నేను అనుకోవ‌టం లేదు అంటూ డైలాగ్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి.

‘స్టీఫెన్ ఎక్క‌డ‌’‘అత‌ని క‌ళ్లు అన్నింటినీ చూస్తున్నాయి’.    ‘చీక‌టి గ్ర‌హాల ఎంపురాన్‌’ ‘కేర‌ళ రాష్ట్రంలో ఓ సాధార‌ణ ఎమ్మెల్యే అత‌ను. అత‌న్ని చూసి ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు? మ‌న‌కు తెలియంది ఏదో ఒక‌టి స్టీఫెన్ నెడుంప‌ల్లి క‌థ‌లో ఉంది’ . ‘దైవ‌పుత్రుడే అన్యాయం చేస్తున్న‌ప్పుడు సైతాన్‌ను కాకుండా ఎవ‌ర్ని సాయం అడ‌గ‌గ‌లం’. ‘స్టీఫెన్ మ‌ళ్లీ తిరిగి వ‌చ్చి నీ మ‌నిషిని, దైవానికి ఆత్మ‌లాంటి దేశాన్ని కాపాడుకో’వంటి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో ‘L2E: ఎంపురాన్’ ట్రైల‌ర్ మాస్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

2019లో రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ‘లూసిఫ‌ర్‌’ సినిమాకు ఇది సీక్వెల్‌ అనే కంటే అంతకు ముందు జరిగిన కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. మూడు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ఇది రెండో భాగం. తొలి భాగాన్ని మించిన ట్విస్టులు, ట‌ర్నులు, రాజకీయ వ్యూహాలు, ప‌న్నాగాలు, వాటిని తిప్పి కొట్టే ప్ర‌తి వ్యూహాలు, ధీటైన హీరోయిజం.. వావ్ అనిపించే సీన్స్.. భారీగా  ‘L2E: ఎంపురాన్’ ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ నెల 27న రాబోతుంది. ఐమ్యాక్స్ ఫార్మాట్ లో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయం అని చెబుతున్నారు.

తొలి భాగాన్ని మించే పాత్ర‌ల‌ను ఇందులో ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. హీరో కాపాడుతున్న రాజ్యాన్ని క‌బ‌లించ‌టానికి బ‌ల‌వంతులైన శ‌త్రువులంద‌రూ ఏక‌మై యుద్ధం చేయ‌టానికి సిద్ధ‌మైతే ఏం జ‌రుగుతుందనేదే ఈ సినిమా స్టోరీ. ప్రతినాయకులు పన్నే ఉచ్చును హీరో ఎలా తిప్పి కొట్టి త‌న రాజ్యాన్ని, ప్ర‌జ‌ల‌ను కాపాడుకున్నాడ‌నేదే క‌థాంశం అని ట్రైల‌ర్‌లో చూపించారు.  

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

మలయాళ సూపర్‌స్టార్‌, కంప్లీట్ యాక్ట‌ర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్ లో  ‘L2E: ఎంపురాన్’ రాబోతుంది.  సినిమా రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినప్పటినుంచి అభిమానులు, ఆడియన్స్ ఈ  చిత్రాన్ని చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.   ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను L2E: ఎంపురాన్ ట్రైల‌ర్ నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లడం ఖాయం అని చెబుతున్నారు. దర్శకుడిగా  పృథ్వీరాజ్ సుకుమార్ విజువలైజేషన్ బాగుంది.   ఐనాక్స్‌ మెగాప్లెక్స్, ఇనార్బిట్ మాల్‌, మ‌లాడ్‌, ముంబై వేదిక‌లుగా మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లోనే కాదు, మలయాళ సినీ ఇండ‌స్ట్రీ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా ఐమ్యాక్స్ వెర్ష‌న్‌లో ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయడం విశేషం.

మోహన్ లాల్ ఖురేషి-అబ్రామ్ అలియా స్టీఫెన్ నెడుంపల్లిగా మ‌రోసారి మాస్ అవ‌తార్‌లో కనిపించబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్, మణికుట్టన్ ఉన్నారు. ఓ'నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్ త‌దిత‌రులు ఇత‌ర‌ ముఖ్య పాత్రలను పోషించారు. గేమ్ ఆఫ్  థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ ఈ మూవీతో భారతీయ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.

మ‌ల‌యాళ చిత్రసీమ‌లోనే అత్యంత భారీ చిత్రంగా ‘L2E: ఎంపురాన్‌’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్,   ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. ముర‌ళీ గోపి క‌థ‌ను అందించారు.తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్‌రాజుకు చెందిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ విడుద‌ల చేస్తోంది. హిందీలో అనీల్ త‌డానీకి చెందిన ఏఏ ఫిల్మ్స్ నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. క‌ర్ణాట‌క‌లో ప్ర‌ముఖ సంస్థ హోంబ‌లే ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. తమిళనాడులో గోకులం గోపాలన్ కి చెందిన శ్రీ గోకులం మూవీస్ ద్వారా విడుదల కాబోతుంది. మ‌ల‌యాళ చిత్ర‌సీమ నుంచి ఐమ్యాక్స్‌లో రిలీజ్ అవుతున్న తొలి చిత్రంగా ‘L2E: ఎంపురాన్‌’ సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం అని చెబుతున్నారు. ‘L2E: ఎంపురాన్‌’ చిత్రాన్ని మ‌ల‌యాళంతో పాటు తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లో మార్చి 27న ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News