Lucifer 2 Empuraan Pre Release Business: లూసీఫర్ మూవీ మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించింది. తెలుగులో చిరంజీవి కూడా ‘గాడ్ ఫాదర్’గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా లూసీఫర్ మూవీకి సీక్వెల్ అనే కంటే.. లూసీఫర్ కథ కంటే ముందు జరిగిన స్టోరీతో ప్రీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అంతేకాదు బుక్ మై షోలో ఈ సినిమా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. లూసీఫర్ అంటే ఉదయపు నక్షత్రం మరియు దండించే వాడు యముడు అనే అర్ధంలో తెరకెక్కించారు. ఎంపురాన్ అంటే రాజు కంటే ఎక్కువ... దైవం కంటే తక్కువ అని అర్ధం ఉంది. మొత్తంగా టైటిల్ తోనే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
అంతకాదు ఈ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో మలయాళ సినీ ఇండస్డ్రీలో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా మలయాళ సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమా రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో దాదాపు రూ. 5.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ తెలుగు కాకుండా.. మలయాళం, హిందీ, కన్నడతో రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. మొత్తంగా మలయాళ సినీ ఇండస్ట్రీలో రూ. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. మొత్తంగా ఈ సినిమా హిట్ అయితే..తెలుగు, కన్నడ తర్వాత ప్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయిన తొలి మలయాళ చిత్రంగా రికార్డులకు ఎక్కనుంది.
ఓవరాల్ గా ఈ సినిమా హిట్ అనిపించుకోవాలటే.. రూ. 102 కోట్ల షేర్ (రూ. 225 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టాలి. ఈ సినిమాకు మినిమం పాజిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ ను దున్నేయడం ఖాయం అని చెప్పాలి. మొత్తంగా తెలుగు సంవత్సరాది ఉగాది, ముస్లిమ్స్ పండగ ఈద్ పండగ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









