)
L2Empuraan Release Date: కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా ఒక మూసకు పరిమితం కాలేదు. అంతేకాదు అవసరమైతే.. వేరే హీరో భాషకు సంబంధించిన సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో లూసీఫర్’ మూవీకి ప్రీక్వెల్ గా ‘ఎల్ 2 ఎంపురాన్’ సినిమా చేస్తున్నారు. మురళి గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ సంయుక్తంగా నిర్మించారు. మోహన్ లాల్ ఈ సినిమాలో ఖురేషి-అబ్రామ్ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లిగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, మంజు వారియర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మణికుట్టన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఓ'నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్ వంటి వారు ఇతర ముఖ్యపాత్రల్లో యాక్ట్ చేశారు.
అక్టోబర్ 5, 2023న ఫరీదాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత సిమ్లా, లేహ్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, చెన్నై, గుజరాత్, హైదరాబాద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ముంబై, కేరళతో సహా పలు దేశ, విదేశాల్లో షూటింగ్ జరిగింది. 1:2.8 రేషియోతో అనమోర్ఫిక్ ఫార్మాట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ వాసుదేవ్ వ్యవహరించారు.అఖిలేష్ మోహన్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ మోహన్‌దాస్ వ్యవహరిస్తున్నారు. స్టంట్ డైరెక్టర్ స్టంట్ సిల్వా, క్రియేటివ్ డైరెక్టర్ నిర్మల్ సహదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ దీపక్ దేవ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నారు.
జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి 9న సినిమాలోని పాత్రను పరిచయం చేస్తూ వదిలిన గ్లింప్స్ అందరినీ అట్రాక్ట్ చేసింది. ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానెల్‌లలో గత కొన్ని రోజులుగా సినిమాలోని అన్ని పాత్రలను రివీల్ చేస్తూ వదిలిన గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 26న ఖురేషి-అబ్రహం అలియాస్ స్టీఫెన్ నేడుంపల్లిగా మోహన్‌లాల్ పాత్రను గ్రాండ్‌గా రివీల్ చేయడంతో అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని మార్చి 27న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ హై ఆక్టేన్, స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో SVC గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe