L2Empuraan:దిల్ రాజు మాట్లాడుతూ .. ‘లూసిఫర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. మల్లూవుడ్‌లో అత్యధిక బడ్జెట్‌తో తీసిన ఈ సీక్వెల్ ఏ రేంజ్‌లో ఉందో టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. ట్రైలర్ గూస్ బంప్స్ తెపిస్తోంది. ట్రైలర్ ను అలా చూస్తూనే ఉండిపోయాను. ఎంతో గ్రాండియర్‌గా అనిపించింది. స్క్రీన్ మీద మోహన్ లాల్ కనిపిస్తే వావ్ అనిపిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ కాబోతోన్నారు. కాదు అయిపోయారని చెప్పారు. అన్ని భాషల్లో ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానన్నారు.
మాస్టర్ కార్తికేయ మాట్లాడుతూ .. ‘ఎంపురాన్ నాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం. నన్ను నమ్మి నాకు ఈ చిత్రంలో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన పృథ్వీరాజ్ కి థాంక్స్. ఇంత పెద్ద చిత్రంలో నటించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. సలార్ తరువాత ఇంత పెద్ద ఆఫర్ వస్తుందని ఊహించలేదన్నారు. మోహన్‌లాల్ గారితో నటించడం ఆనందంగా ఉందన్నారు. మార్చి 27న ఎంపురాన్ రిలీజ్ అవుతుంది.
కెమెరామెన్ సుజిత్ వాసుదేవ్ మాట్లాడుతూ .. ‘ఎంపురాన్ సినిమాకు పని చేయడం గర్వంగా ఉందన్నారు. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ గారితో పని చేయడం హ్యాపీగా ఉందన్నారు. ఇది చాలా గొప్ప చిత్రం అవుతుందన్నారు. మార్చి 27న ఈ సినిమా రిలీజ్ అవుతోందన్నారు. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









