Allu Arjun Arrest Latest Updates: అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్.. హైకోర్టులో మధ్యంతర బెయిల్

Fri, 13 Dec 2024-5:44 pm,

Allu Arjun Arrest Live Updates: పుష్ప-2 మూవీ కలెక్షన్స్‌లో రికార్డులు సృష్టిస్తున్న క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఘటన సంచలనంగా మారింది. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Allu Arjun Arrest Live Updates: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌కు రాగా.. ఒక్కసారి అభిమానులు భారీగా దూసుకువచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకోగా.. రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు.. అల్లు అర్జున్‌ను ఒక నిందితుడిగా గుర్తించారు. శుక్రవారం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

Latest Updates

  • Allu Arjun Arrest Latest News: అల్లు అర్జున్‌పై స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> ప్రభుత్వం తప్పు వల్లే ఈ పొరపాటు చోటుచేసుకుంది. 

    ==> అల్లు అర్జున్‌ను అరెస్టు చేయటం అన్యాయం, అక్రమం, దుర్మార్గం.

    ==> ఆయన నిర్మాత కాదు.. చిత్ర యూనిట్ పిలిస్తే అక్కడికి వెళ్లాడు. అలాంటప్పుడు అల్లు అర్జున్‌ది తప్పు ఎలా అవుతుంది..

  • Allu Arjun Arrest Latest News: హైకోర్టులో వాదనల కొనసాగుతున్నాయి.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> థియేటర్‌కు వెళ్లడానికి  ఆయన సినిమా నటుడు, అనుమతి తీసుకున్నాడు కదా- హై కోర్టు 

    ==> అనుమతి తీసుకున్నప్పటికీ, హీరోహీరోయిన్లను థియేటర్‌కు పిలవద్దు అని పోలీసులు థియేటర్ యాజమాన్యంకు లేఖ రాశారు- జీపీ
    ==> మరి థియేటర్ యాజమాన్యం హీరోకు ఈ విషయం చెప్పారా-హై కోర్టు 
    ==> ఒకవేళ చెబితే ఎలా చెప్పారు-హై కోర్టు

  • Allu Arjun Arrest Latest News: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. ఈ మేరకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Allu Arjun Arrest Latest News: హైకోర్టులో అల్లుఅర్జున్‌ క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు క్వాష్‌ చేయాలని పిటిషన్‌..

    ==> తొక్కిసలాట కేసులో ఏ11గా అల్లు అర్జున్..

    ==> ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్ చేశాం-జీపీ..

    ==> అల్లు అర్జున్‌కు బెయిల్ ఇవ్వొద్దని జీపీ వాదనలు..

    ==> ప్రీమియర్‌షోకు అనుమతి తీసుకోలేదన్న పోలీసులు..

    ==> డిసెంబర్‌ 2న పోలీసులకు లేఖ రాశామన్న అడ్వొకేట్.

    ==> అకనాలెడ్జ్‌మెంట్ తీసుకున్నారా అనిప్రశ్నించిన కోర్టు..

    ==> చిక్కడపల్లి ఏసీపీ సంతకం చేసిన కాపీని కోర్టుకు సమర్పించిన అల్లు అర్జున్ తరపు లాయర్..

    ==> అల్లు అర్జున్‌పై ఉన్న ఆరోపణ ఏంటన్న హైకోర్టు..

  • Allu Arjun Arrest Latest News: మరోవైపు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనల కొనసాగుతున్నాయి.

  • Allu Arjun Arrest Latest News: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే హైకోర్టు తీర్పు వచ్చే వరకు నాంపల్లి జడ్డి ఎదురుచూస్తున్నారు.

  • Allu Arjun Arrest Latest News: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అవసరమైతే తాను పెట్టిన కేసును విత్అ చేసుకుంటానని ఈ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్‌ తెలిపారు. అల్లు అర్జున్‌కు ఈ ఘటనతో సంబంధం లేదని.. బన్నీని విడుదల చేయాలని పోలీసులను కోరారు. అల్లు అర్జున్‌తో పాటు ఆ రోజు చాలా మంది థియేటర్‌కు వచ్చారని పేర్కొన్నారు.

  • Allu Arjun Latest News: మరికాసేపట్లో ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కి  బయలుదేరనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
     

  • Allu Arjun Latest News: అల్లు అర్జున్ అరెస్ట్ దురదృష్టకరమని బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ అన్నారు. యాక్టర్ ఒక్కరే అన్ని విషయాలు చూసుకోలేరని.. ఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

  • Allu Arjun Arrest Live Updates: నాంపల్లి కోర్టులో ప్రస్తుతం విచారణలు కొనసాగుతున్నాయి. బెయిల్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

  • Allu Arjun Arrest Live Updates: చంచల్‌గూడ జైల్ వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధిస్తే.. చంచల్‌గూడ జైల్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు.

  • Allu Arjun Arrest Live Updates: గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు తరలించారు.

  • Allu Arjun Arrest Live Updates: అల్లు అర్జున్ నివాసానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఇప్పటికే చేరుకోగా.. తాజాగా నాగబాబు చేరుకున్నారు. అల్లు అరవింద్‌కు ధైర్యం చెబుతున్నారు.

  • Allu Arjun Arrest Live Updates: అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్

    ==> అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అంగీకరించింది. సాయంత్రం 4 గంటలకు విచారణ చేపట్టనుంది.
    ==> విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు లాయర్ వాదనలు కీలకం కానున్నాయి. 

  • Allu Arjun Arrest Live Updates: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించినట్లు తెలుస్తోంది. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని.. చట్టం ముందు అందరూ సమానులేనని అన్నారు. ఈ అరెస్ట్ విషయంలో తన జోక్యం ఏమి లేదని చెప్పారు.

  • అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత ఏపీ డిప్యూటీ సీఎం ట్విట్టర్ ఖాతా నుంచి చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

     

  • Allu Arjun Arrest Live Updates: అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరినట్లు తెలుస్తోంది.

  • Allu Arjun Arrest Live Updates: వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్‌ను గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లనున్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరపరచనున్నారు.

  • Allu Arjun Arrest Live Updates: అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై లంచ్ మోషన్ విచారణ జరపాలని హైకోర్టును న్యాయవాదులు కోరారు.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేసిన న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి 

    ==> సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని న్యాయవాదులు కోరారు

    ==> పోలీసులను అడిగి 2.30కి చెబుతానన్న అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్

    ==> విచారణ 2.30కి వాయిదా

  • Allu Arjun Arrest Live Updates: "నాన్న నన్ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నన్ను సన్మాన సభకు తీసుకెళ్లడం లేదు.." అరెస్ట్‌కు ముందు తన నాన్న అరవింద్‌తో అల్లు అర్జున్ మాట్లాడారు.

  • Allu Arjun Arrest Live Updates: అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు.. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసు.. 105 సెక్షన్‌ నాన్‌బెయిలబుట్‌ కేసు.. 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం.. 

    ==> BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం

  • Allu Arjun Arrest Live Updates: సినీ నిర్మాత అల్లు అరవింద్, ఆయన సోదరుడు అల్లు శిరీష్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

  • Allu Arjun Arrest Live Updates: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి చేరుకున్నారు.

  • Allu Arjun Arrest Live Updates: 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ కేసులో హీరో అల్లు అర్జున్ చేసిన చిక్కడపల్లి పోలీసులు

    ==> ఈ నెల నాలుగో తేదీన ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కి సలాటలో ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. 

    ==> ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు

    ==> ఇప్పటికే ఈ కేసులో సంధ్యా థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్లను కూడా పోలీసులు అరెస్ట్ 

    ==> ఈరోజు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link