)
Gaddar Film Awards 2024 Latest Updates: కాంతారావు ఫిల్మ్ అవార్డును రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మొమెంటో, ప్రశంసా పత్రం అందజేశారు.
Gaddar Film Awards 2024 Latest Updates: పైడి జయరాజ్ ఫిలిం అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. బీఎన్ రెడ్డి ఫిలిం అవార్డును డైరెక్టర్ సుకుమార్, నాగిరెడ్డి చక్రపాణి ఫిలిం అవార్డుని ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు, రఘుపతి వెంకయ్య అవార్డుని యండమూరి వీరేంద్రనాథ్ అందుకున్నారు.
Gaddar Film Awards 2024 Latest Updates: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డును నందమూరి బాలకృష్ణ అందుకున్నారు. ఈ అవార్డు ప్రైజ్ మనీని బసవకతారకం క్యానర్స్ ఆసుపత్రికి ఇస్తున్నట్లు బాలయ్య ప్రకటించారు.
Gaddar Film Awards 2024 Latest Updates: పుష్ప 2 సినిమాకి బెస్ట్ హీరో అవార్డును అల్లు అర్జున్ అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మొమెంటో, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు. అనంతరం రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకుని పుష్ప-2 మూవీలోని రప్పా రప్పా డైలాగ్‌తో అదరగొట్టారు.
Gaddar Film Awards 2024 Latest Updates: బెస్ట్ డైరెక్టర్ అవార్డును కల్కి 2989 ఏడీ మూవీకి నాగ్ అశ్విన్ అందుకున్నారు. 35 చిన్న కథ కాదు సినిమాకి బెస్ట్ హీరోయిన్ అవార్డును నివేదా థామస్ అందుకున్నారు.
Gaddar Film Awards 2024 Latest Updates: సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. అవార్డులు ఎవరు అందుకున్నారంటే..?
==> నిర్మాతలుగా స్పెషల్ జ్యూరీ అవార్డు- రాజేష్ కల్లెపల్లి, ప్రశాంత్ రెడ్డి (రాజు యాదవ్ మూవీ)
==> స్పెషల్ జ్యూరీ అవార్డు (రాప్ సాంగ్ )- ఫారియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)
==> బెస్ట్ డెబ్యూ డైరెక్టర్- యదు వంశీ (కుర్రోళ్ళు సినిమా)
==> తృతీయ ఉత్తమ చిత్రం- లక్కీ భాస్కర్
==> ద్వితీయ ఉత్తమ చిత్రం-పోట్టెల్
==> ప్రథమ ఉత్తమ చిత్రం- కల్కి 2989 ఏడీ
Gaddar Film Awards 2024 Latest Updates: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. అవార్డులు అందుకున్న వారు వీరే..
==> బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ- ప్రొడ్యూసర్ గూడూరి నారాయణరెడ్డి, దర్శకుడు యాతా సత్యనారాయణ
==> స్పెషల్ జ్యూరీ- దుల్కార్ సల్మాన్ (లక్కీ భాస్కర్ సినిమా). ఈ అవార్డును నాగవంశీ అందుకున్నారు..
==> స్పెషల్ జ్యూరీ- అనన్య నాగళ్ళ (పొట్టేల్ మూవీ)
==> స్పెషల్ జ్యూరీ అవార్డ్- దర్శకులు సుజీత్-సందీప్ (క మూవీ)
Gaddar Film Awards 2024 Latest Updates: జయసుధ, జయప్రద, సుహాసిని చేతుల మీదుగా వీరికి అవార్డులు అందజేశారు.
==> బెస్ట్ కొరియోగ్రాఫర్- గణేష్ ఆచార్య (దేవర మూవీలోని ఆయూధ పూజ సాంగ్)
==> బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫర్- చంద్రశేఖర్ రాధోడ్ (గ్యాంగ్‌స్టర్ మూవీ)
==> బెస్ట్ కమెడియన్స్ అవార్డు- సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా 2)
==> బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - భీమ్స్ (రజాకార్)
==> బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్- శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు)
==> బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
==> బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిమ్- 35 చిన్న కధ కాదు సినిమా
Gaddar Film Awards 2024 Latest Updates: సీఎం రేవంత్ రెడ్డికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షేక్ హ్యాండ్ ఇచ్చి హాగ్ ఇచ్చారు. తెలంగాణ గీతం ఆలపన తరువాత అవార్డుల ప్రదానోత్సవం కొనసాగింది.
Gaddar Film Awards 2024 Latest Updates: సీఎం రేవంత్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీస్టార్ విజయ్ దేవరకొండతోపాటు ఇతర సినీ, రాజకీయ ప్రముఖలతో హైటెక్స్ సందడిగా మారింది.
Gaddar Film Awards 2024 Latest Updates: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా అవార్డులకు ఎంపికైన వారికి సిల్వర్ మొమెంటో, రూ.5 లక్షల క్యాష్ ప్రైజ్, ప్రశంసా పత్రం అందజేశారు.
Gaddar Film Awards 2024 Latest Updates: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా 2014-2023 జ్యూరీ కమిటీ మెంబర్స్ దశరధ్, డీవీకే రాజులను గోల్డెన్ మొమెంటో ప్రదానం చేసి సత్కరించారు.
Gaddar Film Awards 2024 Latest Updates: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2024 కార్యక్రమానికి జూబ్లీహిల్స్ నివాసం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరారు.
Gaddar Film Awards Live Updates: సినీ కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డుల (TGFA) ప్రదానోత్సవ వేడుక శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. 14 ఏళ్ల తరువాత సినీ అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తుండడంతో టాలీవుడ్లో సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ ఫిల్మ్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకను ప్రారంభించారు. నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పడిన తరువాత వచ్చిన ప్రతి ఏడాది ఉత్తమ సినిమాలను ఎంపిక చేసి అవార్డులను అందజేస్తున్నారు. గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకల లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.