LYF: ఏప్రిల్ 4న గ్రాండ్ గా విడుదల కాబోతున్న లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) మూవీ..!

LYF Release Date:దివంగత లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ప్రముఖ నేపథ్య గాయకుడు SP చరణ్ చాలా ఏళ్ళ తర్వాత 'లైఫ్' (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్ళీ నటుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 18, 2025, 12:55 AM IST
LYF: ఏప్రిల్ 4న గ్రాండ్ గా  విడుదల కాబోతున్న  లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) మూవీ..!

LYF Release Date: దివంగత పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కుమారుడు లీడ్ రోల్లో యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘లవ్ యువర్ ఫాదర్’ (LYF). ఈ చిత్రాన్ని మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి  సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా రాబోతుంది. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా SP చరణ్, నవాబ్ షా లీడ్ రోల్స్ నటించారు.  ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా.. వంటి  నటీ నటులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.

Add Zee News as a Preferred Source

ఈ సినిమాకు సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. ఆ కాపీని చూసి సంతోషించిన మూవీ టీం మీడియాతో మాట్లాడారు.

డైరెక్టర్ పవన్ కేతరాజు మాట్లాడుతూ.. "కుమారుడు బాధ్యత తీర్చేందుకు తండ్రి పడే ఆరాటం, నాన్న కోసం తనయుడు చేసే పోరాటం కథే లవ్ యువర్ ఫాదర్ సినిమా. ఈ కథ అంతా కాశీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. సినిమాలో శివతత్వాన్ని కూడా చూపించామన్నారు. హీరో తండ్రి పాత్రలో SP చరణ్ అద్భుతంగా నటించారన్నారు. ఈ సినిమా విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మెలోడీ బ్రహ్మ మణి శర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ఎస్సెట్ గా ఉండబోతుందని చెప్పారు. అంతేకాదు  ఈ సినిమా క్లైమాక్స్ అందరినీ కంట తడి పెట్టిస్తుందన్నారు.

నిర్మాత అన్నపరెడ్డి రామస్వామి రెడ్డి మాట్లాడుతూ.. "సినిమా చాలా బాగా వచ్చిందన్నారు. ఈ మూవీలో ఎక్కువ భాగం వారణాసిలోనే న షూట్ చేసామన్నారు. ఈ సినిమాలో దైవత్వంతో పాటు తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించరన్నారు. ఫస్ట్ కాపీ చూశాక RR చాలా అద్భుతంగా అనిపించింది. సినిమాపై మా నమ్మకం ఇంకా పెరిగిందన్నారు. దీంతో  మణి శర్మ ని సత్కరించమన్నారు. RR బాగా కుదిరినందుకు ఆయన కూడా చాలా ఆనందమన్నారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామన్నారు. ఈ నెల 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతామన్నారు.

ఇక ఈ సినిమాకు డైలాగ్స్ నాగ మాధురి రాశారు.  శ్యామ్ కే నాయుడు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందించారు.  రామ కృష్ణ ఎడిటర్ గా వ్యవహరించారు. ఆర్ట్ డైరెక్టర్ గా చిడిపల్లి శంకర్, కొరియోగ్రాఫర్ గా మొయిన్, ఫైట్ మాస్టర్ గా కార్తీక్.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News