LYF success Celebrations:గత శుక్రవారం విడుదలైన "LYF - Love Your Father" చిత్రం ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఈ సినిమా విడుదలకి ముందే ట్రైలర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను తగ్గట్టు మంచి ఫలితాన్నే రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ తో జనాల్లోకి బాగానే తీసుకెళ్లగలిగారు. రిలీజ్ తర్వాత ఆ ఎక్స్ పెక్టేషన్స్ అందుకుంది. ఈ సినిమాలో తండ్రి-కొడుకుల అనుబంధాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా SPB చరణ్, శ్రీ హర్ష, కషిక కపూర్ లీడ్ రూల్స్ లో యాక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు. మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా, అన్నపరెడ్డి స్టూడియోస్
సంయుక్తంగా నిర్మించాయి.
ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో మూవీ టీం సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సినిమాని ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ముందుగా హీరో హర్ష మాట్లాడుతూ.. "మా ఎల్ వై ఎఫ్’ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు. మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా సినిమా చూడని వారుంటే ఖచ్చితంగా వెళ్లి చూడండని పిలుపు నిచ్చారు.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
ఇక డైరెక్టర్ పవన్ కేతరాజు మాట్లాడుతూ..ఈ సినిమా చాలా బాగుందని చాలా మంది ఫోన్లు వస్తున్నాయి. ఇంత చిన్న సినిమాని ఆదరించినందుకు ఆడియన్స్ కు కృతజ్ఞతలు. ఇంటర్వెల్, క్లైమాక్స్ అదిరిపోయిందని అంటున్నారు. నిజంగా ఈ సినిమాకి ఇంతలా కనెక్ట్ అయినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఇక నిర్మాత కిషోర్ రాఠి మాట్లాడుతూ.. "సినిమా చాలా బాగుందని చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు. ఈ సినిమా హిట్ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. మనీషా ఆర్ట్స్ బ్యానర్ లో గత నలభై ఏళ్లుగా ఇలాంటి కుటుంబ కథ చిత్రాలే తీస్తున్నామన్నారు. వాటిలో చాలా వరకు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఈ సినిమా కూడా మంచి ఆదరణ పొందడం సంతోషంగా ఉందన్నారు.
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









