LYF Pre Release Event: శ్రీహర్ష, కషిక కపూర్ జోడిగా SP చరణ్ లీడ్ రోల్లో నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా.. వంటి ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘LYF’(లవ్ యువర్ ఫాదర్). ఇక ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి MLA మల్లా రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసారు.
ఈ సందర్బంగా హీరో శ్రీ హర్ష మాట్లాడుతూ.. ముందుగా ఛీఫ్ గెస్ట్ మల్లా రెడ్డికి స్పెషల్ థాంక్స్. మల్లా రెడ్డి ఈ సినిమాలో నటించి ఉంటే బాగుండని కోరారు. ఆయన ఈ చిత్రంలో యాక్ట్ చేసి ఉంటే.. పాన్ వరల్డ్ సినిమా అయ్యేదని చమత్కరించారు. ఆయన నటించకపోవడం వల్ల పాన్ ఇండియా సినిమా అయ్యిందని అన్నారు. అలాగే శ్రీ హర్ష ఈ సందర్బంగా తన తల్లి దండ్రులను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాని నిర్మించిన తన తండ్రి రామ స్వామి రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీసిన డైరెక్టర్ పవన్ కేతరాజుకి ఎంతో రుణపడి ఉంటానన్నారు. మణి శర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తన సినిమాకి సంగీతం ఇవ్వడం తన లక్ అన్నారు. అలాగే సింగర్ SP చరణ్, నటుడు ప్రవీణ్ తో కలిసి పని చెయ్యడం మరిచిపోలేని విషయం. వారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనని ఎల్లప్పుడూ దీవించాలని ప్రేక్షకులను శ్రీ హర్ష కోరారు.
ఇక MLA మల్లా రెడ్డి మాట్లాడుతూ.. ముందుగా ప్రేక్షకులకు నమస్కారాలు... ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో తీశారని తెలిసి ఆశ్చర్యపోయా అన్నారు. హీరో శ్రీ హర్ష తమిళ హీరో విజయ్ కంటే స్మార్ట్ గా ఉన్నారని చమత్కరించారు. హీరోయిన్ కషిక కపూర్ మంచి కసి కసిగా బాగుందని సరదాగా మాట్లాడారు. శ్రీ హర్ష తమ కాలేజీ స్టూడెంట్ అని, వాళ్ళ తండ్రి తమ కాలేజీ ప్రిన్సిపాల్ అన్నారు. వీళ్ళు సినిమా చెయ్యడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే ఈ సినిమాలో పని చేసిన నటీనటులకి అభినందనలు తెలిపారు.ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి పాన్ ఇండియా హిట్ చెయ్యాలని మల్లా రెడ్డి కోరారు.
ఇక డైరెక్టర్ పవన్ గారు మాట్లాడుతూ.. తమని దీవించడానికి వచ్చిన ముఖ్య అతిధి మల్లా రెడ్డికి ప్రతేక కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే చరణ్ గారు ఈ సినిమా చేయబట్టే చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. బాల సుబ్రహ్మణ్యం చరణ్ ని మనకు గిఫ్ట్ గా ఇచ్చారని ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. బాల సుబ్రహ్మణ్యం ఎక్కడున్నా కూడా చరణ్ ని, మమ్మల్ని దీవిస్తూ ఉంటారని అన్నారు. సినిమాలో చరణ్ గారి ప్రతి షాట్ ఎంజాయ్ చేశానని అన్నారు. బాలు గారు లేని లోటు చరణ్ తో తీరిపోయిందన్నారు. ఈ సినిమాకి పని చేసిన సీనియర్ టెక్నీషియన్స్ శ్యామ్, మణి శర్మకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి టాప్ టెక్నీషియన్స్ తో పని చెయ్యడం తన అదృష్టమన్నారు. చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ఇక సింగర్ SP చరణ్ మాట్లాడుతూ.. వేదిక మీద ఉన్న పెద్దలందరికి నమస్కారం. అలాగే ఈ సినిమాని హిట్ చేయబోతున్న ప్రేక్షకులకు నమస్కారం అంటూ తన ప్రసంగం మొదలు పెట్టారు. తన క్యారెక్టర్ ని అద్భుతంగా డిజైన్ చేసిన డైరెక్టర్ పవన్ కేతరాజు ధన్యవాదాలు. అలాగే నిర్మాతలు రామస్వామి రెడ్డికి, కిషోర్ రాఠీక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హీరో శ్రీ హర్ష ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డారన్నారు. వారణాసిలో ఆయన పడ్డ కష్టాన్ని గుర్తు చేశారు. ఈ సినిమాతో శ్రీ హర్షకి మంచి సక్సెస్ ఇవ్వాలని ప్రేక్షకులని కోరారు.ఇంత మంచి సినిమాలో తాను పాడేందుకు అవకాశం ఇవ్వనందుకు కోపంగా ఉన్నానని సరదాగా వ్యాఖ్యానించారు..
నిర్మాత కిషోర్ మాట్లాడుతూ.. LYF సినిమాని ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరారు. మణి శర్మ కి, SP చరణ్ కి ఇంకా ఈ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులకి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా డైరెక్టర్ పవన్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు. పవన్ సినిమాని చాలా బాగా తీశారన్నారు. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందన్నారు.
సినిమా పేరు : ఎల్ వై ఎఫ్ (లవ్ యువర్ ఫాదర్)
నటీనటులు : శ్రీహర్ష, ఎస్పీ చరణ్, కేశిక కపూర్, ప్రవీణ్, చత్రపతి శేఖర్, రఘు బాబు, భద్రం, షకలక శంకర్, శాంతి కుమార్, బంటి తదితరులు.
రచన, దర్శకత్వం : పవన్ కేతరాజు
సంగీత దర్శకుడు : మణిశర్మ
కాస్ట్యూమ్ డిజైనర్ : భావన పోలేపల్లి
కాస్ట్యూమర్ : రాంబాబు
కొరియోగ్రఫీ : మెయిన్
ఎడిటర్ : దేవరంపాటి రామకృష్ణ
డిఓపి : శ్యామ్ కే నాయుడు
PRO : మధు వి ఆర్
బ్యానర్స్ : అన్నపరెడ్డి స్టూడియోస్, మనిషా ఆర్ట్స్ & ప్రై లి
నిర్మాతలు : కిషోర్ రాతి, మహేష్ రాతి, ఏ సామ్రాజ్యం, ఏ చేతన్ సాయిరెడ్డి,
ఆర్ట్ శంకర్ : చిడిపల్లి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









