మూవీ రివ్యూ: లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)
నటీనటులు : ఎస్పీ చరణ్, శ్రీహర్ష, కేశిక కపూర్, ప్రవీణ్, చత్రపతి శేఖర్, రఘు బాబు, భద్రం, షకలక శంకర్, శాంతి కుమార్, బంటి తదితరులు
సంగీత దర్శకుడు : మణిశర్మ
ఎడిటర్ : దేవరంపాటి రామకృష్ణ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్యామ్ కే నాయుడు
నిర్మాతలు : కిషోర్ రాతి, మహేష్ రాతి, ఏ సామ్రాజ్యం, ఏ చేతన్ సాయిరెడ్డి,
రచన, దర్శకత్వం : పవన్ కేతరాజు
లెజెండరీ గాయకుడు దివంగత పద్మవిభూషణ్ గ్రహీత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ చాలా గ్యాప్ తర్వాత నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'లైఫ్' (లవ్ యువర్ ఫాదర్). మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ పతాకాలపై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ కేతరాజు డైరెక్ట్ చేశారు. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా యాక్ట్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
కిషోర్ (ఎస్పీ చరణ్), సిద్ధూ (శ్రీ హర్ష) తండ్రీ కొడుకులు. అనాథలకు,అనార్తులకు ఆపద వస్తే ముందుండి సాయం చేసే టైపు. తండ్రి అడుగుజాడల్లో కొడుకు ఈ కార్యక్రమాలను నడిపిస్తుంటాడు. అంతేకాదు అనాథ శవాలకు సొంత డబ్బుతో దహన సంస్కారాలు జరిపిస్తూ ఉంటాడు కిషోర్. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అందుకు అవసరమైన డబ్బు కోసం హార్స్ రైడింగ్ బెట్టింగ్ కాస్తాడు. ప్రతిసారి అతడు బెట్టింగ్ నెగ్గుతాడు. గుర్రాలకు, హార్స్ రైడర్లకు స్టెరాయిడ్స్ ఇవ్వడం ద్వారా కిషోర్ బెట్టింగ్స్ నెగ్గుతున్నాడని చెబుతాడు. అంతేకాదు ఆ డబ్బులతోనే అనాథ శవాలకు దహన సంస్కారాల పేరుతో చేసే సేవ వెనుక పెద్ద స్కాం ఉందన వార్తలొస్తాయి. దీని వెనుక బడా బిజినెస్ మ్యాన్ కబీర్ (నవాబ్ షా) ఉంటాడు. కిషోర్, సిద్ధూను అతను ఎందుకు టార్గెట్ చేయడం వెనక ఉద్దేశ్యం ఏమిటి? కాశీలో శివ భక్తులు ఎటువంటి సాయం అందించారు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
'అఖండ', 'కార్తికేయ 2' వరకు మన దగ్గర వచ్చే చాలా చిత్రాలు దైవత్వంతో తెరకెక్కుతున్నాయి. ఇలాంటి డివోషనల్ టచ్ ఉన్న ఫాంటసీ ఫిలిమ్స్ బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. 'లవ్ యువర్ ఫాదర్' కూడా ఆ లిస్టులోకి వచ్చే సినిమా అని చెప్పాలి.
'లవ్ యువర్ ఫాదర్' సినిమాలో తండ్రీ కొడుకుల అనుబంధంతో పాటు దైవత్వాన్ని జోడించి తెరకెక్కించిన సినిమా. కథలో భాగంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో కాలేజ్ ఎపిసోడ్స్ తో సరదా సరదాగా సాగిన సినిమా ఆ తర్వాత కీలక మలుపు తీసుకుంటుంది. సెకండాఫ్ కూడా ఫాంటసీ పాయింట్ స్టార్ట్ అయ్యాక వచ్చే కామెడీ సీన్స్ ఫ్లోని కొంత పక్కదారి పట్టించినా.. మధ్యలో గుర్రాలకు స్టెరాయిడ్స్ ఇవ్వడం అనే కాన్సెప్ట్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా దర్శకుడు రాసుకోవడం వంటి పాయింట్స్ బాగున్నాయి. క్లైమాక్స్ సినిమాను మలుపు తిప్పుతుంది. మధ్య మధ్యలో కొంత ల్యాగ్ ఉన్నా అందర్నీ మెప్పించే డివోషనల్ పాయింట్ కోసం ఈ సినిమాను ఎంచక్కా చూడొచ్చు.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం 'లవ్ యువర్ ఫాదర్'కు మెయిన్ పిల్లర్ లా నిలిచింది. శివుని నేపథ్యంలో ఆయన చేసిన పాట, శివ భక్తుల సన్నివేశాలకు ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. డైలాగ్స్ ను పవర్ ఫుల్ గా రాసుకోని ఉండాల్సింది.
నటీనటుల విషయానికొస్తే..
తండ్రిగా ఎస్పీ చరణ్ నటన బావుంది. రెగ్యులర్ ఆర్టిస్ట్స్ చేసినట్టు కాకుండా కొత్తగా ప్రయత్నం చేశారు. హీరోగా ఫస్ట్ సినిమాకు శ్రీహర్ష డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. డ్యాన్స్ లో మంచి ఈజ్ చూపించాడు. ప్రయత్నిస్తే మంచి నటుడు అవుతాడు. కషికా కపూర్ గ్లామర్ తో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించాయి.
పంచ్ లైన్.. ‘లవ్ యువర్ ఫాదర్’ ఆకట్టుకునే తండ్రీ కొడుకుల దేవోషనల్ డ్రామా..
రేటింగ్: 3/5
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









