మూవీ రివ్యూ: మ్యాడ్ స్క్వేర్ (Mad Square)
నటీనటులు: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ, రఘుబాబు, సత్యం రాజేష్,సునీల్, శుభలేఖ సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నేపథ్య సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: శామ్‌దత్ ISC
ఎడిటర్: : నవీన్ నూలి
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సమర్పణ: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
విడుదల తేది: 28-3-2025
ప్రస్తుతం అన్ని భాషల్లో గత కొన్ని రోజులుగా కొత్త కథల కంటే ఆల్రెడీ హిట్టైన సినిమాలకు బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ రూట్లోనే తెరకెక్కిన చిత్రం ‘మ్యాడ్’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
మ్యాడ్ సినిమాకు ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి ఈ సినిమాను స్టార్ట్అయినట్టు కాకుండా.. ఢిల్లీలో తీహాడ్ జైల్లో మ్యాడ్ ఫ్రెండ్ గణేష్ అలియాస్ లడ్డూ ఓ ఖైదీగా తన తోటి ఖైదీలతో తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతో ప్రారంభం అవుతోంది. పెళ్లి చేసుకొని సెటిల్ కావాల్సిన లడ్డూ తన స్నేహితుల కారణంగా ఎందుకు తీహాడ్ జైలుకు వెళ్లాడు. ఈ సందర్భంగా జరిగిన కథ ఏమిటి.. ? ఈ సందర్భంగా వీళ్లు గోవా వెళతారు. అక్కడ మ్యూజియంలో వాస్కోడిగామా లాకెట్ ను ఎవరో దొంగతనం చేస్తారు. అసలు లడ్డూ పెళ్లి ఎందుకు ఆగిపోయింది ? ఈ సందర్భంగా అతని స్నేహితులు మ్యాడ్ (మనోజ్, అశోక్, దామోదర్) ఎలా కారణమయ్యారు. చివరకు ఏం జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ప్రస్తుతం మన దర్శకులు.. కొత్త స్టోరీల కంటే.. తమకు సక్సెస్ ఇచ్చిన స్టోరీలకు కొనసాగింపుగా కొత్త స్టోరీలను సీక్వెల్స్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ కోవలో కళ్యాణ్ శంకర్.. తొలి ప్రయత్నంలోనే ‘మ్యాడ్’ అంటూ యూత్ కాలేజ్ లవ్ స్టోరీతో మెప్పించాడు. ఇపుడా సినిమాకు సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాను తెరకెక్కించాడు. తొలి చిత్రాన్ని మించిన డబుల్ డోస్ హాస్యంతో ‘మ్యాడ్ స్క్వేర్’తో ప్రేక్షకులను పిచ్చెక్కించాడనే చెప్పాలి. ఇలాంటి కామెడీ సినిమాలకు నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నట్టు.. తాను సినిమాలో రాసుకున్న సీన్స్ తో ప్రేక్షకులను కుర్చీలో కదలనీయకుండా చేశాడనే చెప్పాలి. ముఖ్యంగా లడ్డూ పెళ్లి జరగుతూ ఉంటే.. హీరోతో పాటు వచ్చిన ఓ ర్యాపిడ్ ఫ్రెండ్ తో లడ్డూకు కాబోయే భార్య లేచిపోవడం వంటి సీన్స్ ప్రేక్షకులను కితకితలు పెట్టిస్తాయి. ఈ సినిమా చూస్తుంటే.. గతంలో జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఇవివి తరహా కామెడీ సినిమాలను గుర్తుకు వస్తాయి. ప్రేక్షకులను రెండు గంటల పాటు సీట్లతో కదలనీయకుండా.. కేవలం హాస్యపు ఝల్లుతో మరోసారి ప్రేక్షకులను డబుల్ మ్యాడ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఇందులో లడ్డూ పాత్ర చేసిన విష్ణుతో పాటు దామోదర్ క్యారెక్టర్ చేసిన సంతోష్ శోభన్ ప్రేక్షకులను తమ కామెడీ టైమింగ్ తో పొట్ట చెక్కలయ్యే చేశాడు. ప్రేక్షకులు రొటిన్ రొడ్డు కొట్డుడు స్టోరీల కంటే కాస్తంత రిలీఫ్ గా తమ మెదడు పక్కన పెడితే... ఈ సినిమా మెప్పిస్తుంది. ఇప్పటి టెన్త్, ఇంటర్ విద్యార్ధులు ఎక్కువగా ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. చివర్లో దర్శకుడు పోకిరి తరహా క్లైమాక్స్ ప్లాన్ చేసాడు. అది కామెడీ కోసమే అన్నట్టు సర్దిచెప్పుకోవాలి. మొత్తంగా దర్శకుడు తాను ఎంచుకున్న సబ్జెక్ట్ ను ఎక్కడా బోర్ కొట్టకొండా చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్. భీమ్స్ భీమ్స్ సిసిరోలియో పాటలు యూత్ కు కనెక్ట్ అవుతారు. సినిమా నిడివి తక్కువ ఉండటం ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సితార, శ్రీకర, ఫ్యార్య్చూన్ ఫోర్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటులు విషయానికొస్తే..
నార్నే నితిన్ ఈ సినిమాకు పేరుకు హీరోనే కానీ.. మిగతా క్యారెక్టర్స్ ఈ సినిమాలో డామినేట్ చేశాయి. మొదటి సినిమా కంటే ఇందులో నటనలో కాస్తంత మెరుగు పడ్డాడు. మరోవైపు సంతోష్ శోభన్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు. మ్యాడ్ మాదిరే.. మ్యాడ్ స్క్వేర్ లో అంతకు మించిన నవ్వులతో ముంచెత్తాడు. రామ్ నితిన్ క్యూట్ గా తన యాక్టింగ్ మెప్పించాడు. ఇక విష్ణు కూడా తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించాడు. మిగత పాత్రల్లో పోలీస్ ఆఫీసర్ గా నటించిన సత్యం రాజేష్.. డాన్ గా సునీల్.. విష్ణు తండ్రి పాత్రలో నటించిన మురళీ ధర్ గౌడ్ తమ తమ టైమింగ్ తో మెప్పించారు.
పంచ్ లైన్.. మ్యాడ్ స్క్వేర్.. నో లాజిక్.. ఓన్లీ ఫన్ మ్యాజిక్..
రేటింగ్: 2.75/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









