Mad Square Trailer Talk Review: మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ టాక్ రివ్యూ.. వినోదం అంతకు మించి..

Mad Square Trailer Talk Review: తెలుగు సహా  ఇతర భాషల్లో గత కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్ మూవీస్ కు సీక్వెల్స్ ను తెరకెక్కిస్తున్నారు. అందులో మెజారిటీ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తాయి. ఈ కోవలో ‘మ్యాడ్’ మూవీకి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా రాబోతుంది. ఈ నెల 28న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 26, 2025, 03:05 PM IST
Mad Square Trailer Talk Review: మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ టాక్ రివ్యూ.. వినోదం అంతకు మించి..

Mad Square Trailer Talk Review: తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సీక్వెల్ చిత్రాల్లో  'మ్యాడ్ స్క్వేర్' ఒకరు. బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు.  ఇక మ్యాడ్ మూవీ సాధించిన విజయంతో పాటు వినోదం పాళ్లు ఎక్కువగా ఉంటంతో 'మ్యాడ్ స్క్వేర్'పై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే  ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకుంటాయి.  తాజాగా ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా టీజర్, అందులోని సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్'పై అంచనాలు పీక్స్ కు చేరాయి. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.

Add Zee News as a Preferred Source

ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇందులో రెట్టింపు వినోదాన్నిదట్టించి మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కించినట్టు సమాచారం.  ట్రైలర్ ను గమనిస్తే, మ్యాడ్ విజయానికి కారణమైన కామెడీ, మెయిన్  పాత్రల అల్లరిని మ్యాడ్ స్క్వేర్ లో కూడా చూడబోతున్నట్టు ట్రైలర్ చూస్తే సమజ్ కొస్తోంది.  పూర్తి  హాస్యాస్పదమైన సంభాషణలు, విచిత్రమైన పరిస్థితులతో మ్యాడ్ స్క్వేర్ వినోదాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లింది.  అలాగే తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం ట్రైలర్ కు మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది. రిలీజైన నిమిషాల్లోనే ఈ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

'మ్యాడ్ స్క్వేర్' చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'లడ్డు గానీ పెళ్లి, 'స్వాతి రెడ్డి', 'వచ్చార్రోయ్' పాటలు మ్యూజికల్ గా  చార్ట్‌బస్టర్‌ లుగా నిలిచాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ అద్భుత కెమెరామెన్ గా పనిచేశారు.  జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ ప్రతిభ తోడై.. వెండితెరపై భారీ వినోదాన్ని అందించడానికి మ్యాడ్ స్క్వేర్ రెడీ అవుతోంది.

‘మ్యాడ్’ సినిమాతో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించిన దర్శకుడు కళ్యాణ్ శంకర్, సీక్వెల్ తో మరోసారి హాస్యపు  విందుని అందించబడం గ్యారంటీ అని చెప్పొచ్చు. మ్యాడ్ సినిమాలో నటించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ త్రయం మొదటి భాగానికి మించిన అల్లరి ఈ సినిమాలో చేయబోతున్నట్టు సమాచారం. ‘మ్యాడ్ స్క్వేర్’ ను శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఆడియన్స్ ఎక్స్ పెక్ట చేసిన దానికంటే.. ఎక్కువ వినోదాన్ని మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నట్టు తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ 2025, మార్చి 28న టాకీస్ లలో విడుదల కాబోతుంది. ఈ సమ్మర్ కు  ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచనుంది. ఇక ‘మ్యాడ్’ మూవీ  సినిమా ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో రూ. 2.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. ‘మ్యాడ్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.60 కోట్లును కొల్లగొట్టింది. తాజాగా మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా  మ్యాడ్ మూవీకి 8 రెట్లు అదనంగా రూ. 21 కోట్ట ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. రూ. 22 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది. మరి ఈ సినిమా టాక్ బాగుంటే.. సమ్మర్ లో బాక్సాఫీస్ దగ్గర  కుమ్మేయడం గ్యారంటీ అని చెప్పాలి. 

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News