MAD Square Twitter Review: MAD స్క్వేర్.. మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేయగలిగిందా..?

Mad Square X Review: ఉగాది కానుకగా తెలుగు సినిమాలు థియేటర్స్ దగ్గర సందడి చేయడానికి సిద్ధమైపోయాయి. ఇందులో భాగంగా నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుద్.. అలానే MAD సీక్వెల్ MAD స్క్వేర్ సినిమాలు ఈరోజు మార్చి 28న విడుదలయ్యాయి. మరి ఇందులో ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన MAD స్క్వేర్ సినిమా గురించి ప్రేక్షకులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం..

Written by - Vishnupriya | Last Updated : Mar 28, 2025, 07:22 AM IST
MAD Square Twitter Review: MAD స్క్వేర్.. మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేయగలిగిందా..?

MAD Square X Review: యంగ్ హీరోస్ నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ల కలయికలో వచ్చిన MAD సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే.  ఇక ఈ సినిమాకి.. మొదటి పార్ట్ విడుదలైనప్పుడే సీక్వెల్ కూడా ప్రకటించారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం సీక్వెల్.. మ్యాడ్ స్క్వేర్ ఈరోజు మార్చ్ 28న థియేటర్స్ లో విడుదలైంది. ఇప్పటికే ఈ చిత్రం మొదటి షో యుఎస్ లో పూర్తి కాగా.. అక్కడి ప్రేక్షకు నీ సినిమా గురించి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం…

Add Zee News as a Preferred Source

ఫస్ట్ ఆఫ్ మొదటి పార్ట్ లాగానే ఎంతో ఫన్నీగా సాగిందని.. ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అని ట్విట్టర్లో ట్వీట్స్ పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో ఫేమస్ నటుడు సునీల్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సునీల్ రోల్ ఈ సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అని నిర్మాత నాగవంశీ ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్స్ లో తెలియజేశారు. ఇక ఇదే విషయం గురించి సినిమా చూసినవారు కూడా చెప్పడం విశేషం. ఇందులో సునీల్ డార్క్ కామెడీ హైలెట్ అంటూ ట్వీట్స్ పెడుతున్నారు.

ముఖ్యంగా లడ్డు ఎపిసోడ్ చాలా బాగుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

ఇంకొక ప్రేక్షకులు బాయ్ అలానే వద్దు వాళ్ళ ఫాదర్ మధ్య వచ్చే కాన్వర్జేషన్ మంచి నవ్వులు తెప్పిస్తున్నాయి అంటూ పోస్ట్ చేశారు. అంతేకాదు దర్శకులు కళ్యాణ్ శంకర్ సీక్వెల్ చాలా బాగా తీసారని మెచ్చుకుంటున్నారు. 

 

సంతోష్ శోభన్ డాన్స్ వీడియో షేర్ చేస్తూ.. సంతోష్ శోభన్ నటన ఈ సినిమాలో కూడా చాలా బాగుంది అంటూ ప్రశంసల కురిపిస్తున్నారు. 

 

ఇంకొకళ్ళు లడ్డు ఎపిసోడ్ చాలా బాగుంది అని.. అక్కడ ఇక్కడ కొన్ని సీన్లు తప్ప మిగతా మొత్తం నవ్వుకోవచ్చు అని.. మొత్తం పైన ఫస్ట్ ఆఫ్ బాగుందని.. సెకండ్ హాఫ్ కోసం ఎదురు చూస్తున్నామని కామెంట్స్ పెట్టారు. 

 

మొత్తం పైన ట్విట్టర్ రివ్యూ చూస్తూ ఉంటే మొదటి పార్ట్ లాగానే ఈ సినిమా కూడా.. కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. మరి ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి.
Read more: Pawan Kalyan: పవన్ ఇలాఖాలో బూతు స్టెప్పులతో అమ్మాయిల రచ్చ రంబోలా.. షాకింగ్ వీడియో..   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News