Maharani 4 Series: సోనీ లివ్ లో ‘మహారాణి’ సీజన్ 4.. టీజర్ తో వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు..

Maharani 4 Series: ఓటీటీ మాధ్యమాలు పెరిగిన తర్వాత వెబ్ సిరీస్ లకు మంచి గిరాకీ పెరిగింది. అందులో కొన్ని సిరీస్ లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో సోనీ లివ్‌లో ‘మ‌హారాణి’ సిరీస్ కు మంచి పేరు వచ్చింది. తాజాగా ఈ సిరీస్ లో సీజన్ 4 త్వరలో స్ట్రీమింగ్ కు రానుంది. తాజాగా ఈ  సీజ‌న్ 4 సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల‌ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 4, 2025, 11:27 AM IST
Maharani 4 Series: సోనీ లివ్ లో ‘మహారాణి’  సీజన్ 4.. టీజర్ తో వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు..

Maharani 4 Series:మ‌న ఓటీటీ మాధ్య‌మాల్లో ఎక్కువ  ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన వెబ్ సిరీస్‌ల్లో  ‘మహారాణి’ వెబ్ సిరీస్ ఒకటి. ఒక మహారాణి వెబ్ సిరీస్ కు  ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సిరీస్ నుంచి నాలుగో సీజ‌న్ త్వ‌ర‌లోనే సోనీ లివ్ లో  స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ న‌టి హ్యుమా ఖురేషి లీడ్ రోల్లో యాక్ట్ చేసిన  ఈ సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుండ‌టం మ‌రింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ‘మహారాణి’ సీజ‌న్ 4కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

Add Zee News as a Preferred Source

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

చ‌దువు రాని ఓ ఇల్లాలు ఎలా రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఎదిగింది. అందకు  రాణి భార‌తి (హ్యుమా ఖురేషి) లైఫ్ జర్నీ  తెలియ‌జేసే సిరీస్ ఇది. ఈ వ్య‌వ‌స్థ‌లో ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదరయ్యాయి. అధికారంలో ఉన్న ఇబ్బందులు, కుట్ర‌లు, కుతంత్రాలు..  రాజ‌కీయ వైరుద్ధ్యాలు, వైషమ్యాలు.. ఎలా ఉంటాయనేది ఈ సిరీస్ లో మ‌నం చూడొచ్చు.గతంలో వచ్చిన మూడు వెబ్ సిరీస్ లకు మంచి ప్రేక్షకాదరణ పొందింది.  గ‌త మూడు సీజ‌న్స్ త‌ర‌హాలోనే నాలుగో సీజ‌న్ కూడా మ‌రింత గ్రిప్పింగ్ ఆడయన్స్  ముందుకు తీసుకురాబోతుంది.

టీజ‌ర్‌ను ఎంతో ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు.  ఎలాంటి భ‌యం లేకుండా ఉండే ముఖ్య‌మంత్రి రాణి భార‌తిగా హ్యుమా ఖురేషి త‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కాపాడుకోవ‌టానికి ఎంత దూరమైనా వెళ్లేందకు వెనకాడని మనస్తత్వం. మొత్తంగా పవర్ ఫుల్ లేడీ సీఎం పాత్రలో  అల‌రించ‌బోతున్నారు. ఇందులో ఈమె పాత్ర ఉమా భారతి, వసుంధరా రాజే జయలలిత, మమతా బెనర్జీని గుర్తకు తెస్తున్నాయి.  టీజ‌ర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటూ రానున్న సీజ‌న్ 4పై అంచ‌నాల‌ను పెంచేసింది. త్వరలో సోనీ లివ్ లో ప్రసారం కానున్న ‘మహారాణి’ సీజన్ 4లో పవర్‌ఫుల్ రాణి భారతిని వీక్షించడానికి  ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News