Mahavatar Narasimha 50 Days Records:ఒక్కో సారి కొన్ని అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయి. అలాంటి అద్భుతాల్లో ఒకటి ‘మహావతార్ నరసింహా’. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. అంతేకాదు యానిమేషన్ చిత్రాల్లో ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. ఓ యానిమేషన్ చిత్రంగా రిలీజైన ఈ మూవీ మన దేశంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులు నమోదు చేసింది. తాజాగా ‘మహావతార్ నరసింహా’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 50 రోజులు పరుగును పూర్తి చేసుకుంది. ఈ చిత్రం వరల్ద్ వైడ్ ఇప్పటి వరకు రూ. 325 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనాలు నమోదు చేసింది. హిందీలోనే దాదాపు రూ. 180 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. రూ. 1.5 కోట్ల లోపు ఓపెనింగ్ అందుకున్న ఈ చిత్రం రూ. 180 కోట్ల పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ను అందుకుంది.
తెలుగులో మంచి లాభాలను అందుకున్న ఈ చిత్రం 50రోజులు కంప్లీట్ చేసుకుంది. అది కూడా ప్రపంచ వ్యాప్తంగా 200పైగా టాకీస్ లలో 50 రోజులు పరుగును పూర్తి చేసుకోవడం విశేషం. తెలుగు స్టేట్స్ లో 20 పైగా థియేటర్స్ 50 రోజుల పరుగును పూర్తి చేసుకుంది. హిందీలో 160 థియేటర్స్..ప్రపంచ వ్యాప్తంగా 200 థియేటర్స్ లో పరుగు పూర్తి చేసుకొని సంచలనం రేపింది. అంతేకాదు ఈ సినిమా ఈ రోజు నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఐదు భాషల్లో కావడం విశేషం.
శ్రీ మహా విష్ణు దుష్ణ శిక్షణ.. శిష్ఠ రక్షణలో భాగంగా పలు అవతారాలు ఎత్తారు. అందులో నారసింహా అవతారానికి సెపరేట్ ప్లేస్ ఉంది. ఇది దశావతారాల్లో నాల్గవది. ఈ యానిమేషన్ మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అంతేకాదు యానిమేషన్ చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఇచ్చిన స్పూర్తితో పలు భక్తిరస ప్రధాన చిత్రాలు రాబోతున్నాయి. అందులో హనుమండిపై పలు యానిమేషన్ చిత్రాలు రాబోతున్నాయి. తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా $ 2 మిలియన్ డాలర్స్ వైపు అడుగులు వేస్తోంది.
అంతేకాదు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 333 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అందులో హిందీ బాక్సాఫీస్ దగ్గర నుంచే దాదాపు రూ .200 కోట్ల నెట్ వసూళ్లను కొల్లగొట్టడం పక్కా. అందులో మన దేశంలోనే రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్డటం విశేషం. కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 20 కోట్ల వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా ఈ సినిమా విడుదలైన 10 రోజుల్లో రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్.. 15 రోజుల్లో రూ. 150 కోట్ల గ్రాస్.. మొత్తంగా ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.350 కోట్ల చేరుకుంటుందా లేదా అనేది చూడాలి. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ భారీ ఎత్తున నిర్మించారు. అశ్వనీ కుమార్ డైరెక్ట్ చేశారు.
త్వరలో దశావతారాలైన పరశురామ అవతారం, రామావతారం, కృష్ణావతారం, కల్కి అవతారాలపై చిత్రాలు రాబోతున్నాయి. ఈ సినిమాను తెలుగు, హిందీ ప్రేక్షకులే ఎక్కువ ఆదరించడం విశేషం. మొత్తంగా హిందీ ప్రేక్షకుల దయ వల్లే ‘మహావతార్ నరసింహా’ ఈ రేంజ్ వసూళ్లను దక్కించుకుంది. మొత్తంగా హిందీ ప్రేక్షకులకు నచ్చితే.. అక్కడ దాదాపు నెల రోజులు పాటు బాక్సాఫీస్ దగ్గర కుమ్మేస్తూ ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.