Mahesh Babu: మహేష్ బాబు తో సితార.. అది కూడా శ్రీలీల డబ్బింగ్ తో.. వీడియో చూశారా..?

Mahesh Babu Sitara Ad: మహేష్ బాబు, ఆయన కుమార్తె సితార ఘట్టమనేని తాజాగా చేసిన యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మహేష్ ప్రస్తుతం ఎస్‌ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న SSMB29 షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, తన కూతురుతో చేసిన ఈ యాడ్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.  

Written by - Vishnupriya | Last Updated : Mar 21, 2025, 12:14 PM IST
Mahesh Babu: మహేష్ బాబు తో సితార.. అది కూడా శ్రీలీల డబ్బింగ్ తో.. వీడియో చూశారా..?

Mahesh Babu daughter ad: మహేష్ బాబు కుమార్తె సితార ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగు. పలు యాడ్స్, టీవీ షోలలో మెరిసిన సితార, తన తండ్రితో కలిసి చేసిన తాజాగా మరోసారి.. ఒక ‌‌యాడ్‌లో నటించి..ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ ‌‌యాడ్‌లో మహేష్ బాబు కూడా ఉండడం. ఈ యాడ్‌లో మహేష్ పింక్ షర్ట్‌లో స్టైలిష్‌గా కనిపించగా, సితార తన ముద్దు ముద్దు నవ్వులతో అందరినీ ఆకట్టుకుంది.  

Add Zee News as a Preferred Source

అయితే ఈ యాడ్ లో సితార వాయిస్ విన్నవారు మాత్రం తెగ ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఈ యాడ్‌లో సితార వాయిస్‌పై నెటిజన్ల నుంచి ఆసక్తికరమైన ప్రశ్నలు వస్తున్నాయి. సితార డబ్బింగ్ అచ్చం హీరోయిన్ శ్రీలీల గొంతులానే అనిపించడంతో, చాలా మంది “సితారకి శ్రీలీల డబ్బింగ్ చెప్పిందా?” అంటూ అడుగుతున్నారు. 

గతంలో గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబుతో కలిసి నటించిన శ్రీలీల, షూటింగ్ సమయంలో సితారతో బాగా క్లోజ్ అయ్యారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడటంతో, వారు కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి.  అందుకే ఈ వీడియోలో సితారకి శ్రీ లీల డబ్బింగ్ చెప్పు ఉండొచ్చు అనేది వినిపిస్తోంది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trends (@trends.official)

కొంతమంది మాత్రం సితార వాయిస్ కూడా అలానే ఉంటుందని.. కాబట్టి శ్రీ లీల డబ్బింగ్ చెప్పలేదని నిర్ధారిస్తున్నారు.అయితే ఇది నిజమా కాదా అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. మరోపక్క ఈ వీడియో మహేష్ బాబు లుక్ చూసి ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. “మహేష్-సితార నాన్నకూతుళ్లు కాదు.. అన్నాచెల్లెల్లు లాగా ఉన్నారు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. అదనంగా, మహేష్ గడ్డంతో కనిపించిన లుక్‌కి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.  

ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు నటిస్తున్న SSMB29 చిత్రం యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోంది. ఒడిశాలో కీలక షెడ్యూల్ పూర్తయిన ఈ సినిమా షూటింగ్ త్వరలో హైదరాబాద్‌లో జరగనుంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు. బాహుబలి మరియు RRR వంటి హిట్ సినిమాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

READ ALSO: Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ 2 రాశులకు పట్టిందల్లా బంగారం, సమాజంలో గౌరవం..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News