Mahesh Babu Another multiplex at Hyderabad: సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు స్టార్ డమ్ ఇచ్చిన సినిమా ఇండస్ట్రీలోనే తన పెట్టుబడులు పెడుతున్నారు. ఈయన నేపథ్యంలో థియేటర్స్ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏషియన్ వాళ్లతో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో ‘AMB’ సినిమాతో సంచలనం రేపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ మల్టీప్లెక్స్ ఇది. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ తర్వాత ఏఎంబీలో సినిమా చూడటం ఇపుడు ప్రెస్టీజియస్ గా మారింది. తాజాగా ఈయన హైదరాబాద్ లో మరో మల్టీప్లెక్స్ తో రాబోతున్నాడు.
ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఓడియన్, ఓడియన్ డీలక్స్, మినీ ఓడియన్ థియేటర్స్ భాగస్వామ్యంతో సరికొత్త మల్టీప్లెక్స్ తో రాబోతున్నాడు. దీనికి AMB క్లాసిక్ అని పేరుతో రాబోతుంది. 2026 సంక్రాంతికి ఈ సినిమా థియేటర్ రీ ఓపెన్ అయింది. సినిమాటిక్ అనుభూతికి పెంపొందించే విధంగా మల్టీప్లెక్స్ 7 లావిష్ స్క్రీన్స్ ను డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్, 4K లేజర్ ప్రొజెక్షన్ స్క్రీన్స్ తో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది.
మహేష్ బాబు విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను నవంబర్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రపంచ యాత్రికుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార్, మాధవన్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.
Read more: విడాకుల దిశగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. షాక్ కు గురి చేస్తోన్న న్యూస్..
Read more: ఒకే టైటిల్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ హిట్స్ అందుకుంటే.. చిరు డిజాస్టర్ అందుకున్నాడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









