)
Mahesh Babu Son Gautham : బాహుబలి: ది ఎపిక్ సినిమా విడుదల హంగామా మామూలుగా లేదు. సుమారుగా 10 ఏళ్ల తర్వాత బాహుబలి 1&2 సినిమాలను కలిపి ఒకే భాగంలో బాహుబలి: ది ఎపిక్ అనే టైటిల్ తో ఈ రోజున విడుదల చేశారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితర నటీనటులు ఇందులో నటించారు. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని ఈ సినిమా పైన రివ్యూ ఇస్తూ తన ఎక్స్పీరియన్స్ ని పంచుకున్నారు.
సినిమా చూసిన తర్వాత గౌతమ్ రియాక్షన్ ఎలా ఉందంటే బాహుబలి లాంటి ఒక బిగ్గెస్ట్ గ్లోబిన్ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడడం అనేది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అంటూ తెలియజేశారు. అయితే ఈ ఎపిక్ విషయంలో తనకు నచ్చిన బెస్ట్ విషయాన్ని తెలియజేశారు. నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏమిటంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారో అనే విషయాన్ని తెలుసుకోవడానికి రెండేళ్లు వెయిట్ చేసాము.. కానీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదంటూ ఫన్నీగా తెలియజేశారు.
బాహుబలి ది ఎపిక్ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి సెకను కూడా నాకు గూస్ బంప్స్ తెప్పించాయని, ఇది మెంటల్ ఎక్కించే ఫిలిం అని , ఈ ఫిలింనే తాను మాటలలో చెప్పలేను అంటూ తన ఎక్సైటింగ్ ను తెలియజేశారు గౌతమ్. ఒక తెలుగు సినిమా ఈ రేంజ్ లో ఇంటర్నేషనల్ లెవెల్ లో పేరు సంపాదించడం గర్వకారణంగా ఉందని, మన తెలుగు సినిమాకు గ్లోబల్ స్థాయిలో రెస్పెక్ట్ రావడం కూడా చాలా గ్రేట్ అంటూ తెలియజేశారు. ఇలాంటి సినిమాలు చూస్తూ పెరిగిన తనకు ఇది గ్రేటెస్ట్ ఫిలిం అంటూ తెలిపారు గౌతమ్. ప్రస్తుతం గౌతమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే బాహుబలి 1 & 2 చిత్రాలు ఒకే భాగంగా విడుదలయ్యి ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈరోజు విడుదలైన ఈ సినిమా ఖచ్చితంగా వంద కోట్ల క్లబ్లో చేరుతుందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.