Mahesh Babu ED: విచారణకు హాజరు కాలేను.. ఈడీకి మహేష్ బాబు లేఖ..

Mahesh Babu ED:ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ కు హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు లేఖ రాశారు.  నిన్ననే మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరు కావాల్సింది కానీ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యలో  విచారణకు తనకు తగినంత సమయం కావాలని కోరుతూ ఈడీకి లేఖ రాసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 28, 2025, 09:24 AM IST
Mahesh Babu ED: విచారణకు హాజరు కాలేను.. ఈడీకి మహేష్ బాబు లేఖ..

Mahesh Babu ED: సాయి సూర్య డెవలస్ పర్స్ పై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడి ఎదుట విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం ఇవ్వాలని నటుడ మహేష్ బాబు ఈడిని కోరారు.  ముందస్తు షెడ్యూల్ ప్రకారం షూటింగ్లకు హాజరు కావలసి ఉన్నందున మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూలేఖ రాసినట్టు తెలిసింది.  ఈ నెల 22న ఈడి ఇచ్చిన సమన్ల ప్రకారం నిన్న బషీర్ బాగ్ ఎన్ ఫోర్స్ మెంట్  కార్యాలయంలో విచారణకు హాజరు కావలసిఉంది.  

Add Zee News as a Preferred Source

కాగా సాయి సూర్య డెవలపర్స్ వెంచర్స్ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ లో కోసం మహేష్ బాబు రూ. 5.9 కోట్లు తీసుకున్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. దీనిపై మరింత లోతుగా విచారించేందుకు మహేష్ బాబుకు సమన్లు జారీ చేశారు.  సురానా గ్రూప్ కంపెనీలైన సాయి సూర్య డెవలపర్స్ భాగ్యనగర్ ప్రాపర్టీ సంస్థల్లో ఈ నెల 16న ఈడి సోదాలు చేసిన విషయం తెలిసిందే కదా.  ఈ సోదాలో మహేష్ బాబుకు చెక్కుల రూపంలో రూ. 3.4 కోట్లు.. నగదు రూపంలో రూ. 2.5 కోట్లు చెల్లించినట్లు ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఈడీ ముందు ఎపుడు హాజరు అవుతారనేది చూడాలి.

చట్టం ముందు అందరు సమానమే కాబట్టి.. మహేష్ బాబు రిక్వెస్ట్ ను ఈడీ ఎంత వరకు స్వీకరిస్తుందనేది చూడాలి. సామాన్యులకు ఒకలా.. సెలబ్రిటీలకు మరోలా న్యాయం ఉండకూడదు కాబట్టి.. మహేష్ బాబును ఈ వ్యవహారంలో ఈడీ సుదీర్ఘంగా విచారించనున్నట్టు సమాచారం. దీనిపై మహేష్ బాబు ఎలాంటి సమాధానం చెబుతారనేది చూడాలి. నగదు రూపంలో రూ. 2 కోట్ల వరకు క్యాష్ తీసుకున్నందున దీనిపై ఈడీ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందనేది చూడాలి.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News