Actor Shine Tom Chacko: నటి లైంగిక ఆరోపణల వేళ బిగ్ ట్విస్ట్..!.. హోటల్ నుంచి పారిపోయిన దసరా విలన్.. ఎందుకో తెలుసా..?

Malayalam Actor Shine tom: మలయాళ నటుడు షైన్ టామ్ చాకో పోలీసులు వస్తున్నారని తెలిసి ఒక్కసారిగా మూడో అంతస్తు నుంచి రెండో అంతస్తులోకిదూకి మరో బిల్డింగ్ మీద జంప్ చేసి పారిపోయాడు.ఈ ఘటన ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 17, 2025, 03:08 PM IST
  • మలయాళ నటుడికి బిగ్ షాక్..
  • డ్రగ్స్ రైడ్ సమయంలో పారిపోయిన నటుడు
Actor Shine Tom Chacko: నటి లైంగిక ఆరోపణల వేళ బిగ్ ట్విస్ట్..!.. హోటల్ నుంచి పారిపోయిన దసరా విలన్.. ఎందుకో తెలుసా..?

Malayalam Actor shine tom Chacko escaped from hotel: మలయాళలో ఇటీవల ఇండస్ట్రీలో అనేక షాకింగ్ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల మలయాళ నటి..విన్సీ సోనీ.. తనను.. ఒక హీరో గతంలో వేధించాడని కూడా తన బాధను చెప్పుకుంది. షూటింగ్ సమయంలో తన ముందే దుస్తులు మార్చుకొవాలని టార్చర్ చేశాడని కూడా నటి వాపోయింది. తన చెయ్యిపట్టుకుని నీచంగా ప్రవర్తించాడని, ఈ విషయం అక్కడున్న వాళ్లకు అందరికి తెలిసిన కూడా ఎవరు రెస్పాండ్ కాలేదని నటి విన్సీ సోనీ కన్నీళ్లు పెట్టుకుంది.

Add Zee News as a Preferred Source

అదే విధంగా ఇటీవల.. గతంలో జరిగిన షాకింగ్ అనుభవంపై ఒక వీడియోను ఇటీవల రిలీజ్ చేశారు. తను ఏవిధంగా వేధింపులు ఎదుర్కొన్నది కూడా చెప్పుకొచ్చింది.  అయితే.. ఇది జరిగి కనీసం ఒక రోజు కూడా గడవక ముందే.. మలయాళ నటుడు షైన్ టామ్ చోకో పోలీసులు రైడ్ చేస్తున్నారని తెలిసి పారిపోయాడు. కేరళలోని కొచ్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో హోటల్ మీద పోలీసులు రైడ్ చేశారు.

అప్పటికే కొచ్చిలో మూడో అంతస్తులో ఉన్న ఆ హీరో.. వెంటనే రెండో అంస్తులోకి దూకి.. అక్కడి నుంచి పక్కనే ఉన్న బిల్డింగ్ లోకి వెళ్లి బైటకు పారిపోయాడు. ఈ క్రమంలో  హీరో ఘటన ఇండస్ట్రీలో దుమారంగా మారింది. ఒక వేళ డ్రగ్స్ తీసుకొకుంటే.. పోలీసులు వస్తున్నారనగానే పారిపొవాల్సిన అవసరం ఏంటని అక్కడి వారు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అయితే.. నటి విన్సీ సోనీ, షైన్ టామ్ చాకో లు ఇద్దరు కలిసి సూత్రవాక్యం అనే సినిమాలో నటించారు. దసరా సినిమాతో టాలీవుడ్ లోకి  ఎంట్రీ ఇచ్చిన షైన్ టామ్.. దేవర, రాబిన్  హుడ్, రంగబలితో పాటు మరికొన్ని సినిమాలు చేశారు.

Read more: Vincy aloshious Video: నా ముందే డ్రెస్ మార్చుకోమ్మని హీరో టార్చర్..!.. షాకింగ్ నిజం బైటపెట్టిన హీరోయిన్.. వీడియో వైరల్..

మొత్తంగా సదరు హీరో వ్యవహారం మాత్రం నెట్టింట రచ్చకు దారితీసింది. ఇప్పటికే విన్సీ సోనీ తనపై జరిగిన వేధింపుల ఘటనను..కేరళ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్, అమ్మ అసోసియేషన్ లకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.  ఈ నేపథ్యంలో ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో ఈ ఘటన దుమారంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News